Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెప్టెంబర్‌ 26 నుంచి ఐపీఎల్‌ 2020!!

IPL 2020 set to be held from September 26 in UAE, Government approval only missing
IPL 2020 Likely To Be Held From September 26 In UAE || Oneindia Telugu

ముంబై: ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం వాయిదా వేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పొట్టి కప్పు వాయిదా అనివార్యమైనట్లు ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేయడంతో.. ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-13వ సీజన్‌కు మార్గం సుగమమైంది.

పర్మీషన్ మాత్రమే పెండింగ్:

పర్మీషన్ మాత్రమే పెండింగ్:

టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడుతుందని ముందుగానే అంచనా వేసిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఐపీఎల్‌ తేదీలు, వేదికను ఖరారు చేసింది. వైరస్‌ కారణంగా నిరవధికంగా వాయిదా వేసిన ఈ ఏడాది సీజన్‌ను సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఆటగాళ్ల వీసాలు, ప్రయాణాలకు సంబంధించిన విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి కోసం బీసీసీఐ వేచిచూస్తోంది. ప్రభుత్వం పర్మీషన్ ఇవ్వగానే.. ఐపీఎల్‌ 2020 తేదీలు, వేదికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

స్టార్‌స్పోర్ట్స్ డిమాండ్:

స్టార్‌స్పోర్ట్స్ డిమాండ్:

మొత్తం 44 రోజుల వ్యవధిలో 60 మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీలు, ప్రసారదారు స్టార్‌ ఇండియాకు బీసీసీఐ తెలియజేసింది. అయితే టోర్నీని మరో వారం రోజులు పొడిగించాలని స్టార్‌స్పోర్ట్స్ డిమాండ్ చేస్తోంది. అందుకు కారణం దీపావళి పండగ. ఒకవేళ నవంబరు 15 వరకూ టోర్నీ జరిగితే.. పండగ సీజన్ కావడంతో యాడ్స్ రూపంలో మరింత ఆదాయం చేకూరుతుందని స్టార్‌స్పోర్ట్స్ భావిస్తోంది. అయితే బీసీసీఐ మాత్రం స్టార్‌స్పోర్ట్స్ రిక్వెస్ట్‌ని పక్కన పెడుతోంది.

క్రికెటర్లకి క్యాంప్:

క్రికెటర్లకి క్యాంప్:

ఒకవేళ నవంబరు 15 వరకూ ఐపీఎల్ 2020 జరిగితే.. డిసెంబరు 3న ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న నాలుగు టెస్టుల సిరీస్‌కి సిద్ధమయ్యేందుకు భారత ఆటగాళ్లకు చాలా తక్కువ సమయం ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది. యూఏఈ వేదికగా ఐపీఎల్‌కి కేంద్ర ప్రభుత్వం పర్మీషన్ ఇవ్వగానే.. క్రికెటర్లకి అక్కడ ఓ క్యాంప్‌‌ని ఏర్పాటు చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఏదేమైనా వచ్చే వారం ఐపీఎల్‌ పాలక మండలి సమావేశం జరుగనుంది. ఐపీఎల్‌ 2020 తుది షెడ్యూల్‌, వేదిక తదితర అంశాలపై ఆ సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు మేం సిద్ధం:

ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు మేం సిద్ధం:

ఐపీఎల్ 2020 లీగ్‌ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నారన్న వార్తలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌ స్పోర్ట్స్‌ సిటీ చీఫ్‌ సల్మాన్‌ హనీఫ్‌ స్పందించాడు. 'ఐపీఎల్ 2020ని దుబాయ్‌లో నిర్వ‌హించాల‌నుకుంటే.. మేము సిద్ధంగా ఉన్నాం. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో అన్ని స‌దుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం, ఐసీసీ అకాడ‌మీ.. స్పోర్ట్స్ సిటీలోనే ఉన్నాయి. స్టేడియంలో తొమ్మిది పిచ్‌లు ఉన్నాయి. ఒక‌వేళ త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మ్యాచ్‌లు నిర్వ‌హించినా ఎటువంటి న‌ష్టం ఉండ‌దు' అని అన్నారు. ఐసీసీ కాంప్లెక్స్‌లో ప్రాక్టీస్ కోసం 38 నెట్ వికెట్లు ఉన్న‌ట్లు హ‌నిఫ్ తెలిపారు.

Story first published: Tuesday, July 21, 2020, 19:44 [IST]
Other articles published on Jul 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+