మార్చి 29 నుంచే ఐపీఎల్‌ షురూ.. హైదరాబాద్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

IPL 2020 To Begin On March 29 And Final On May 24, MI vs CSK Opener Match | Oneindia Telugu

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 ప్రారంభ తేదీల్లో మార్పు ఉంటుందని జరిగిన ప్రచారాన్ని పటాపంచల్ చేస్తూ ముందుగా నిర్ణయించిన తేదినే మెగా లీగ్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. శనివారం ఈ క్యాష్‌రిచ్ లీగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఐసీసీ ఉన్నత స్థాయి సమావేశం, విదేశీ ఆటగాళ్ల రాక ఆలస్యమవుతుందనే కారణంతో ఐపీఎల్ ప్రారంభ తేదీని మార్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు ఉహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే.

ముంబై vs చెన్నై..

ముంబై vs చెన్నై..

బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ ప్రకటించిన మార్చి 29నే ఈ మెగాటోర్నీకి తెరలేవనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్, గత ఏడాది రన్నరప్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడుతుంది. ప్రస్తుతానికి లీగ్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌నే విడుదల చేయగా, నాకౌట్‌ మ్యాచ్‌ల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. మే 17న ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ జరుగుతుంది. అయితే ఫైనల్‌ మాత్రం మే 24న నిర్వహించడం ఖాయమైంది.

డబుల్ హెడర్ ఐదే..

డబుల్ హెడర్ ఐదే..

గతంతో పోలిస్తే ఈ సారి ‘డబుల్‌ హెడర్‌' మ్యాచ్‌ల (ఒకే రోజు 4 గంటలకు, 8 గంటలకు రెండు మ్యాచ్‌లు) సంఖ్యను ఐదుకు పరిమితం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తొలి రోజు, చివరి రోజు మినహాయించి మిగిలిన ఆదివారాల్లో మాత్రమే ఈ డబుల్‌ హెడర్‌‌లు జరుగుతాయి. దాంతో లీగ్‌ దశ రోజుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 44 రోజుల్లో లీగ్‌ మ్యాచ్‌లను ముగిస్తుండగా, ఇప్పుడు అది 50 రోజులు కానుంది.

రాజస్తాన్‌ మినహా ..

ఇక రాజస్తాన్‌ మినహా మిగిలిన ఏడు ఐపీఎల్‌ జట్లన్నీ తమ సొంత వేదికలను కొనసాగించనున్నాయి. రాజస్తాన్‌ మాత్రం జైపూర్‌తో పాటు రెండు మ్యాచ్‌లను గువాహటి వేదికగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే ఇలా రెండో నగరాన్ని హోం గ్రౌండ్‌గా వాడుకోవడం కుదరదంటూ రాజస్తాన్‌ క్రికెట్‌ సంఘం కోర్టులో కేసు దాఖలు చేసింది.

ఏప్రిల్‌ 1 నుంచి హైదరాబాద్‌లో

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తమ ‘హోం' మ్యాచ్‌లను ఎప్పటిలాగే ఉప్పల్‌‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడనుంది. హైదరాబాద్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగనుండగా.. ఈ ఏడు మ్యాచ్‌లు ఏప్రిల్‌ 1, 12, 16, 26, 30, మే 5, 12 తేదీల్లో జరుగుతాయి. ఇతర వేదికల్లో ఏప్రిల్‌ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో సన్‌రైజర్స్‌ తమ మ్యాచ్‌లు ఆడనుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Sunday, February 16, 2020, 9:23 [IST]
Other articles published on Feb 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X