ఆ యంగ్ క్రికెటర్‌తో సచిన్ కుమార్తె ప్రేమాయణం?: లవ్ సింబల్‌తో ఎంకరేజ్: ఏం జరుగుతోంది?

ముంబై: లెజెండరీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్.. ప్రేమలో పడ్డారా? ఆ యంగ్ క్రికెటర్‌తో సన్నిహితంగా ఉంటున్నారా? వారిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయిందా? అసలేం జరుగుతోంది? ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మరోసారి అనేక అనుమానాలను రేకెత్తిస్తోన్న ప్రశ్నలు ఇవి. నిప్పు లేనిదే పొగరాదన్నట్టు.. ఎవరికి వారు గమ్మున ఉంటే ఎలాంటి వార్తలూ రావు. అనుమానాలూ తలెత్తవు. సారా టెండుల్కర్ ఇచ్చిన ఓ చిన్న రియాక్షన్.. ప్రస్తుతం పే..ద్ద చర్చకు తెర తీసినట్టయింది. వారిద్దరి మీద హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియాలో.

ఫీల్డింగ్ ఫీట్‌కు ఫిదా..
ఆ యంగ్ క్రికెటర్ మరెవరో కాదు.. శుభ్‌మల్ గిల్. ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడాడు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ చేసిన ఫీల్డింగ్ ఫీట్.. క్రికెట్ ప్రేమికులనే కాదు- అతని ప్రేమికురాలిగా భావిస్తోన్న సచిన్ సారా టెండుల్కర్‌నూ కట్టి పడేసినట్టుంది. అందుకే- ఓ లవ్ సింబల్ ఇచ్చుకుందామె. వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందనడానికి ఈ ఉదంతాన్ని సాక్ష్యంగా చూపుతున్నారు నెటిజన్లు.

లవ్ సింబల్ ఎందుకంటే..?
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బౌండరీ వైపునకు బుల్లెట్‌లా దూసుకెళ్తోన్న ఓ బాల్‌ను అద్భుతంగా అడ్డుకున్నాడు. ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కొట్టిన షాట్ అది. ముంబై ఇండియన్స్ జట్టు స్కోరు 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు సూర్యకిరణ్ యాదవ్ కొట్టిన షాట్‌కు బౌండరీ వైపు పరుగులెత్తింది బాల్. డీప్ మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్‌లో ఉన్న శుభ్‌మన్ దాన్ని కుడి వైపు డైవ్ చేస్తూ మరీ దాన్ని అడ్డుకున్నాడు. వదిలేసి ఉంటే.. ఖచ్చితంగా బౌండరీ దాటి ఉండేదే. ఆ ఫీట్.. సారా టెండుల్కర్‌కు తెగ నచ్చినట్టుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసి మరీ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. లవ్ ఎమోజీలను పంపించింది.

దాన్ని చుట్టే డిస్కషన్స్..
నెటిజన్లు తమ బుర్రకు పదును పెట్టడానికి ఆ మాత్రం చాలు. రెచ్చిపోతున్నారు. వారిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందనే విషయాన్ని సారా టెండుల్కర్ చెప్పకనే చెప్పిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమ మధ్య డేటింగ్ నడుస్తోందనే విషయాన్ని సారా తనకు తానుగా బయట పెట్టినట్టయిందనీ అంటున్నారు. ఇదివరకు వారిద్దరి మధ్య సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై చోటు చేసుకున్న సంభాషణనూ ప్రస్తావిస్తున్నారు. అదెలా ఉన్నప్పటికీ.. బుధవారం రాత్రి నాటి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలం అయ్యాడు. ఓపెనర్‌గా క్రీజ్‌లోకి దిగిన అతను 11 బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications