For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs SRH: పాండే, శంకర్‌ మెరుపులు.. సన్‌రైజర్స్‌ ఘన విజయం.. ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం!

IPL 2020, RR vs SRH: Manish Pandey, Vijay Shankar shine as Sunrisers Hyderabad thrash Rajasthan Royals

దుబాయ్:‌ ఐపీఎల్ 2020లో ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అదరగొట్టింది. రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ 18.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మనీశ్‌ పాండే (83: 47 బంతుల్లో 4ఫోర్లు, 8సిక్సులు‌), విజయ్ శంకర్‌ (52: 51 బంతుల్లో 6ఫోర్లు‌) హాఫ్ సెంచరీలు చేయడంతో సన్‌రైజర్స్‌ మరో 11 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్‌ ఛేదనలో గెలవడం ఇదే మొదటి మ్యాచ్. ఈ విజయంలో సన్‌రైజర్స్‌ తన ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

ఆదిలోనే భారీ షాక్:

ఆదిలోనే భారీ షాక్:

రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 16 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లోనే డేవిడ్ వార్నర్ (4) స్లిప్‌లో బెన్‌ స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. రాజ్‌పుత్‌ వేసిన తర్వాతి ఓవర్లో జానీ బెయిర్‌స్టో (10) ఫోర్‌, సిక్స్‌ బాది 11 పరుగులు రాబట్టాడు. జోఫ్రా ఆర్చర్‌ వేసిన మూడో ఓవర్లో బెయిర్‌స్టో పెవిలియన్‌ చేరాడు. ఓ మంచి ఇన్‌స్వింగర్‌కు బెయిర్‌స్టో బౌల్డ్‌ అయ్యాడు. దీంతో సన్‌రైజర్స్‌ కష్టాల్లో పడింది.

పాండే మెరుపులు:

పాండే మెరుపులు:

వన్‌డౌన్‌లో వచ్చిన మనీశ్‌ పాండే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కార్తీక్‌ త్యాగీ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది 11 రన్స్‌ సాధించాడు. స్టోక్స్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు సిక్సర్లు బాది 13 పరుగులు రాబట్టాడు. త్యాగీ వేసిన ఆరో ఓవర్లోనూ రెండు సిక్సర్లు, ఫోర్‌ కొట్టి 18 పరుగులు చేయడంతో స్కోరు వేగం పెరిగింది. మరోవైపు విజయ్‌ శంకర్‌ సమయోచితంగా ఆడాడు. దీంతో పవర్‌ప్లే ఆఖరికి సన్‌రైజర్స్‌ 58/2తో నిలిచింది. ఆ తర్వాత మనీష్ సిక్సులతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ బాదాడు. మనీష్‌కు విజయ్‌ శంకర్‌ నుంచి చక్కటి సహకారం లభించడంతో ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరుగులేకుండా పోయింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 140 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది.

ఆదుకున్న శాంసన్:

ఆదుకున్న శాంసన్:

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.. రాబిన్‌ ఉతప్ప (19; 13 బంతుల్లో 2x4, 1x6) ఆదిలోనే ఔటవ్వగా.. బెన్‌ స్టోక్స్‌ (30; 32 బంతుల్లో 2x4), సంజూ శాంసన్ ‌(36; 26 బంతుల్లో 3x4, 1x6) ఆచితూచి ఆడారు. వీరిద్దరూ వికెట్‌ కాపాడుకుంటూ 56 పరుగులు జోడించారు. అయితే జట్టు స్కోర్‌ 86 పరుగుల వద్ద వెనువెంటనే ఔటయ్యారు. జేసన్‌ హోల్డర్‌.. సంజూను బౌల్డ్‌ చేయగా.. తర్వాతి ఓవర్‌లో‌ స్టోక్స్‌ను రషీద్ ‌ఖాన్ బౌల్డ్‌ చేశాడు.

 ఆర్చర్ మెరవడంతో:

ఆర్చర్ మెరవడంతో:

ఆ తర్వాత జోస్ ‌బట్లర్ ‌(9) నిరాశ పరిచాడు. ఇక కెప్టెన్‌ స్టీవ్ స్మిత్ ‌(19; 15 బంతుల్లో 2x4), రియాన్‌ పరాగ్ ‌(20; 12 బంతుల్లో 2x4, 1x6) కూడా పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో జోఫ్రా ఆర్చర్ ‌(16; 7 బంతుల్లో 1x4, 1x6) మెరవడంతో రాజస్థాన్‌ రాయల్స్ స్కోర్‌ 150 దాటింది. హైదరాబాద్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ 3 వికెట్లు తీయగా.. విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో విజయంతో సన్‌రైజర్స్‌ తొలి అంచె మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇది సన్‌రైజర్స్‌కు నాల్గో విజయం కాగా, రాజస్తాన్‌కు ఏడో ఓటమి.

'గతేడాది డుప్లెసిస్‌ డ్రింక్స్‌ మోస్తుంటే ఎంతో బాధనిపించింది.. ఇప్పుడు నేను మోస్తున్నా'

Story first published: Thursday, October 22, 2020, 23:32 [IST]
Other articles published on Oct 22, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+