For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs SRH: మూడేసిన హోల్డర్‌.. రాజస్థాన్‌ స్కోరు 154!!

IPL 2020, RR vs SRH: Jason Holder bags 3 wickets as SRH restrict RR to 154

దుబాయ్: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్ చేసి.. సన్‌రైజర్స్‌ ముందు 155 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇన్నింగ్స్ చివరలో సన్‌రైజర్స్‌ బౌలర్లు రెచ్చిపోవడంతో రాజస్థాన్‌ పరుగులు చేయడంలో ఇబ్బంది పడింది. బెన్‌ స్టోక్స్ ‌(30: 32 బంతుల్లో 2ఫోర్లు), సంజూ శాంసన్ ‌(36: 26 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో రాజస్థాన్‌ ఆమాత్రం స్కోరైనా చేసింది. చివరలో రియాన్‌ పరాగ్ ‌(20 12 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. సన్‌రైజర్స్‌ బౌలర్‌ జేసన్‌ హోల్డర్‌ (3/33) ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రాజస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ జట్టుకు పేలవ ఆరంభం దక్కింది. ఆరంభం నుంచే సన్‌రైజర్స్‌ బౌలర్లు రాజస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేశారు. స్లో పిచ్‌పై పరుగులు సాధించేందుకు బ్యాట్స్‌మన్‌ తెగ కష్టపడ్డారు. నాలుగో ఓవర్లోనే ఓపెనర్‌ రాబిన్‌ ఉతప్ప (19) అనూహ్యంగా రనౌట్‌ అయ్యాడు. ఉతప్ప ఔటైన తర్వాత బెన్ స్టోక్స్‌, సంజూ శాంసన్‌ వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. పవర్‌ప్లే ఆఖరికి రాజస్థాన్‌ 47/1 స్కోరుతో నిలిచింది.

జేసన్‌ హోల్డర్‌ వేసిన 12వ ఓవర్లో సంజు శాంసన్ బౌల్డ్‌ కాగా.. రషీద్‌ ఖాన్‌ వేసిన తర్వాతి ఓవర్‌ మొదటి బంతికే బెన్‌ స్టోక్స్ కూడా బౌల్డ్‌ అయ్యాడు. వీరిద్దరూ 50కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టీవ్‌ స్మిత్ ‌(19), హిట్టర్ జోస్ బట్లర్ ‌(9) పెద్దగా రాణించలేకపోయారు. ముఖ్యంగా పరుగులు చేయడంలో బట్లర్‌ తీవ్రంగా తడబడ్డాడు. పేసర్ నటరాజన్‌ వేసిన 18వ ఓవర్లో పరాగ్‌ రెండు ఫోర్లు, సిక్సర్‌ బాది 16 పరుగులు రాబట్టాడు. ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించాలనుకున్న స్మిత్‌..హోల్డర్‌ వేసిన తర్వాతి ఓవర్‌ మొదటి బంతికే వెనుదిరిగాడు.

రెండో బంతికే దూకుడుగా ఆడుతున్న పరాగ్‌ భారీ షాట్‌ ఆడి డేవిడ్ వార్నర్‌ చేతికి చిక్కాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినా.. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్‌ (16: 7 బంతుల్లో ఫోర్‌,సిక్స్‌) చెలరేగడంతో రాజస్థాన్‌ గౌరవప్రద స్కోరు చేసింది. డెత్ ఓవర్లలో పరుగులు పిండుకోవడంలో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఫలితంగా 154 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగిసింది. ఆరెంజ్‌ఆర్మీ బౌలర్లలో హోల్డర్‌ మూడు వికెట్లతో మెరిశాడు. విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌లు తలో వికెట్‌ తీశారు.

Story first published: Thursday, October 22, 2020, 21:38 [IST]
Other articles published on Oct 22, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+