Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs SRH: ఆరేళ్ల తర్వాత 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు.. రోహిత్, రైనా సరసన మనీష్ పాండే!!

IPL 2020, RR vs SRH: After 6 years Manish Pandey wins Player Of The Match

దుబాయ్‌: గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్‌ లూకీ ఫెర్గూసన్‌ ధాటికి విలవిల్లాడి సూపర్‌ ఓవర్‌లో ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఈ సారి సమిష్టిగా రాణించి కీలక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మనీశ్‌ పాండే (47 బంతుల్లో 83 నాటౌట్‌; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), విజయ్‌ శంకర్‌ (51 బంతుల్లో 52 నాటౌట్‌; 6 ఫోర్లు) విజృంభించడంతో వార్నర్‌ సేన ఈ సీజన్‌లో ఛేజింగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. గురువారం రాత్రి రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. హ్యాట్రిక్‌ పరాజయాల తర్వాత కోలుకున్న వార్నర్‌ సేన పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది.

ఆరేళ్ల తరువాత:

ఆరేళ్ల తరువాత:

ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లో 83 పరుగులు చేసిన మనీశ్‌ పాండేకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. దీంతో ఆరేళ్ల తరువాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పాండే అందుకున్నాడు. అంతేకాదు స్టార్ బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ, సురేష్ రైనాల సరసన చేరాడు. భారత ఆటగాళ్లు అయిన రోహిత్, రైనాలు భారత్, దక్షిణాఫ్రికా, యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. తాజాగా దుబాయ్‌ గడ్డపై ఈ అవార్డు గెలుచుకోవడంతో మూడు దేశాల్లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న మూడో భారత ఆటగాడిగా నిలిచాడు.

తొలి భారతీయ జోడి:

తొలి భారతీయ జోడి:

ఈ మ్యాచ్‌లో మనీష్ పాండే‌, విజయ్ శంకర్‌ కలిసి 140 పరుగుల భాగస్వామ్యంను నెలకొల్పారు. దీంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన తొలి భారతీయ జోడిగా నిలిచారు. 2013లో కోల్‌కతాపై పార్థివ్ పటేల్, శిఖర్ ధావన్‌లు 89 పరుగులు చేశారు. సన్‌రైజర్స్ తరఫున ఐపీఎల్‌లో 3వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం కూడా ఇదే. 2018లో పాండే-కేన్ విలియమ్సన్ 135 రన్స్ చేశారు.

నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం:

'ఇద్దరు మేటి బ్యాట్స్‌మన్‌ త్వరగానే ఔటైపోయారు. ఇప్పటికే సన్‌రైజర్స్‌ మిడిలార్డర్‌పై చాలా చర్చ జరుగుతోంది. నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం అనిపించింది. క్రీజులో ఉండి షాట్లు ఆడాలని అనుకున్నా. ఆ విధంగానే చేశా. చాలా సంతోషంగా ఉంది. జోఫ్రాను ఎదుర్కొనేందుకు మేము వేసుకున్న ప్రణాళికలు సఫలం అయ్యాయి. జట్టు విజయం సాధించడంలో నా పాత్ర ఉన్నందుకు ఆనందపడుతున్నా. విజయ్ శంకర్ బాగా ఆడాడు. ఇదే ఫామ్ మిగిలిన మ్యాచులలో కొనసాగించడానికి ప్రయత్నిస్తాం' అని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సమయంలో చెప్పాడు.

Story first published: Friday, October 23, 2020, 8:48 [IST]
Other articles published on Oct 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+