న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs RCB: బెంగళూరుతో రాజస్థాన్‌ ఢీ.. స్మిత్‌సేనకు చావోరేవో.. ప్రతీకారం తీర్చుకునేనా?

IPL 2020, RR vs RCB Preview: probable XI, match prediction, weather forecast and pitch report

దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా శనివారం మధ్యాహ్నం రాజస్థాన్ రాయల్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరు 8 మ్యాచులు ఆడి.. 5 విజయాలు అందుకుని 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మరో రెండు విజయాలు సాధిస్తే..ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం. మరోవైపు రాజస్థాన్ మూడు విజయాలు మాత్రమే అందుకుని పట్టికలో 7వ స్థానంలో ఉంది. దీంతో ఆర్‌ఆర్ జట్టుకు ఇక నుంచి ప్రతి మ్యాచ్ కీలకమే. అన్ని మ్యాచులు గెలిస్తేనే అధికారిక ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. అందుకే స్మిత్‌సేనకు ఇకనుంచి చావోరేవో పరిస్థితి.

ఫించ్ మెరుపులు ఎక్కడ?:

ఫించ్ మెరుపులు ఎక్కడ?:

బెంగళూరు గత మ్యాచ్‌లో పంజాబ్ జట్టుపై ఓడిపోయింది. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం మ్యాచ్‌ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపించిందని విమర్శలు వచ్చాయి. లెగ్ ‌స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఏబీ డివిలియర్స్‌ ఇబ్బంది పడతాడన్న కారణంతో అతడిని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాడు. అయితే కోహ్లీ ఎత్తు ఫలించలేదు. డివిలియర్స్‌ త్వరగా ఔటయ్యాడు. మళ్లీ కోహ్లీ ఆ తప్పు చేయడని అందరూ అనుకుంటున్నారు. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ పరుగులు చేస్తున్నారు. అయితే ఆరోన్ ఫించ్ మెరుపులు ఇప్పటివరకు లేవు. అతడు వేగంగా ఆడాల్సి ఉంది. ఏబీ కూడా పరుగులు చేయడం శుభసూచికం.

సైనీ, సిరాజ్ తడబాటు:

సైనీ, సిరాజ్ తడబాటు:

బెంగళూరు బౌలర్లు బాగానే రాణిసున్నారు. క్రిస్‌ మోరిస్‌, యుజ్వేంద్ర చహల్‌ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఒకరిద్దరు బౌలర్లు ఎక్కువగా పరుగులిస్తున్నారు. ఉదాన, సైనీ, సిరాజ్ ఫామ్ అందుకుంటే తిరుగుండదు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌ వైఫల్యంతో ఓడిన బెంగళూరు ఈ మ్యాచ్‌కు ఎలా సన్నద్ధమవుతున్నారనేది చూడాలి. మంచి ఫామ్‌లో ఉన్న రాజస్థాన్‌ బౌలర్‌ జొఫ్రా ఆర్చర్‌ను బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ ఎంత సమర్థంగా ఎదుర్కొంటారన్న దానిపై మ్యాచ్‌ ఆధారపడి ఉంటుంది.

స్టోక్స్‌, బట్లర్ రాణిస్తేనే:

స్టోక్స్‌, బట్లర్ రాణిస్తేనే:

సీజన్‌ ఆరంభంలో బలంగా కనిపించిన స్మిత్‌సేన క్రమంగా బలహీనమయింది. పవర్‌ప్లేలో ఎక్కువగా వికెట్లు కోల్పోతుండటం ఆ జట్టును కలవరపెడుతోంది. ఓపెనర్లను మార్చినా ఫలితం లేదు. సంజు శాంసన్‌ మళ్లీ తన దూకుడు ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఉంది. స్మిత్‌, స్టోక్స్‌, బట్లర్‌ బ్యాటుతో రాణిస్తే భారీ స్కోర్ చొయొచ్చు. మిడిల్ ఆర్డర్లో యువ ఆటగాళ్లు పరాగ్‌, తెవాతియా మెరుపులు మెరిపిస్తున్నారు. బౌలింగ్‌ విషయానికి వస్తే జోఫ్రా ఆర్చర్‌ ఒంటరి పోరు చేస్తున్నాడు. జయదేవ్ ఉనద్కత్‌ ఇంతవరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. శ్రేయస్‌ గోపాల్‌, కార్తిక్‌ త్యాగిది కూడా అదే పరిస్థితి. అందరూ సమిష్టిగా రాణిస్తేనే స్మిత్‌సేన విజయాల బాట పట్టనుంది.

ఆర్‌ఆర్ ప్రతీకారం తీర్చుకునేనా?:

ఆర్‌ఆర్ ప్రతీకారం తీర్చుకునేనా?:

రాజస్థాన్, బెంగళూరు జట్లు ఇప్పటి వరకూ 21సార్లు ఎదురుపడ్డాయి. అందులో 10 మ్యాచుల్లో రాజస్థాన్‌ పైచేయి సాధించింది. 9 మ్యాచులలో బెంగళూరు గెలిచింది. రెండు మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన చేతిలో రాజస్థాన్‌ ఓడింది. ఆ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. దీంతో ఆర్‌ఆర్ ప్రతీకారం తీర్చుకోవాలనిచూస్తోంది.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

బెంగళూరు: దేవ్‌దత్‌ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె, క్రిస్ మోరిస్, ఉరుసు ఉదాన, నవదీప్ సైనీ, మొహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్‌.

రాజస్థాన్: బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజూ శాంసన్, రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, జయదేవ్ ఉనద్కత్, కార్తిక్ త్యాగి.

KKR vs MI: కెప్టెన్సీ నుంచి తప్పుకుని.. బ్యాటింగ్ ఇరగదీశావ్ దినేష్ కార్తీక్!!

Story first published: Saturday, October 17, 2020, 12:49 [IST]
Other articles published on Oct 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X