
ఈరోజు ఆటలో అదే చేశా
మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్ మాట్లాడుతూ... 'ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నా. వరుసగా 12-14 మ్యాచ్‌లు ఆడుతుంటే ఏ ఆటగాడికైనా ఒడుదొడుకులు ఉంటాయి. ఒక్క్కోసారి పరిస్థితులు ప్రభావం చూపుతాయి. నా ఆటతీరుపై పూర్తి శ్రద్ధ పెట్టా. మరిన్ని క్రికెట్ షాట్లు ఆడాలంటే సమయం తీసుకొని ఆడాలి. ఈరోజు ఆటలో అదే చేశా. గొప్ప ఆల్‌రౌండర్ అయినా బెన్ స్టోక్స్‌తో కలిసి ఆడటం అద్భుతంగా అనిపించింది. అతడితో గత మూడు మ్యాచ్‌ల్లో ఇప్పుడే బాగా ఆడా. స్టోక్స్ భారీ షాట్లు ఆడడంతో నాపై ఒత్తిడి తగ్గింది' అని పేర్కొన్నాడు.

సిక్సర్లు బాదడంలో ఎలాంటి ప్రణాళికలు లేవు
'ఎన్ని పరుగులు చేయాలి, రన్‌రేట్ ఎంత అనే విషయాలు నేను పట్టించుకోలేదు. బంతిని చూస్తూ ఆడుకుంటూ వెళ్లా. అదే నా ప్రణాళిక. స్టోక్స్, నేను చివరి వరకు క్రీజులో ఉండాలనుకున్నాం. అదృష్టం కొద్ది అలాగే ఆడాం. తొలుత కాస్త నెమ్మదిగా ఆరంభించినా కుదురుకున్నాక బౌండరీలు బాదాలని నిర్ణయించుకున్నా. సిక్సర్లు బాదడంలో ఎలాంటి ప్రణాళికలు లేవు. బంతిని చూస్తూ దంచికొట్టడమే. నా పేరు సంజూ.. ప్రపంచంలో నేనో బలవంతుడిని అనుకుంటూ ఆడా' అని సంజూ శాంసన్ చెప్పాడు.

అత్యధిక సిక్సులు
ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లోనే 54 పరుగులు చేసిన సంజూ శాంసన్ నాటౌట్‌గా నిలిచాడు. సంజూ 4 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. దాంతో ఐపీఎల్ 2020లో అత్యధిక సిక్సులు (23) కొట్టిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఆ తర్వాత పంజాబ్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ (22), ముంబై బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (20), పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (20) ఉన్నారు. హార్డ్ హిట్టర్లు కీరన్ పోలార్డ్, ఆండ్రీ రసెల్, షేన్ వాట్సన్, రోహిత్ శర్మలు ఈ సీజన్లో అంతగా మెరుపులు మెరిపించట్లేదు.

152 పరుగుల భాగస్వామ్యం:
44/2తో కష్టాల్లో ఉన్న రాజస్తాన్ రాయల్స్ జట్టును బెన్ స్టోక్స్ (107 నాటౌట్; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్ (54 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స్‌లు)లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు కలిసి 152 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో రాజస్తాన్ 18.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి విక్టరీని సొంతం చేసుకుంది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన రాజస్తాన్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
బై బై రిషబ్ పంత్.. ఇక నీతో పనిలేదు.. ఇంటికి వెళ్లి హల్వా, పూరీ తింటూ కూర్చో!!


Click it and Unblock the Notifications












