Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. విన్నింగ్‌ కాంబినేషన్‌తోనే బరిలోకి!!

IPL 2020, RR vs KKR: Rajasthan Royals have won the toss and have opted to field

దుబాయ్: ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులకు అసలైన మజానిస్తున్న ఐపీఎల్ 2020‌లో 12వ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా మరికొద్ది సేపట్లో రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్‌ఆర్), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తమ విన్నింగ్‌ కాంబినేషన్‌లో స్మిత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో దిగిన జట్టుతోనే స్మిత్ సేన బరిలోకి దిగుతోంది. కోల్‌కతా ఎలాంటి మార్పులు చేయలేదు.

ఇప్పటికే స్టీవ్ స్మిత్‌ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్‌ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు దినేశ్‌ కార్తిక్‌ కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి మ్యాచ్‌లో ఓడినా.. రెండో మ్యాచ్‌లో గెలిచి తిరిగి పుంజుకుంది. మరి రాజస్థాన్‌ జోరుకు కోల్‌కతా కళ్లెం వేస్తుందా.. లేక రాజస్థాన్‌ తన హవా కొనసాగిస్తుందా అన్నది వేచి చూడాలి. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.

కోల్‌కతా, రాజస్థాన్ జట్లు ఇప్పటివరకు 21 మ్యాచుల్లో తలపడ్డాయి. చెరో పది విజయాలు నమోదు చేశాయి. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. అయితే చివరి ఐదు మ్యాచుల్లో కోల్‌కతాదే పైచేయి. కేకేఆర్ నాలుగింట్లో విజయం సాధించింది. ఆర్‌ఆర్ ఒక్క దాంట్లో గెలుపొందింది. ఈ రెండు జట్ల మధ్య రెండు సార్లు సూపర్‌ ఓవర్లు జరిగాయి. రెండింట్లోనూ రాజస్థాన్‌ విజయం సాధించింది. దుబాయ్ మైదానంలో రెండు జట్లు చెరో మ్యాచ్‌ ఆడి ఓటమి పాలయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ దుబాయ్‌ మైదానంలో ఐదు మ్యాచులు జరిగ్గా.. మూడు జట్లు 200 పరుగుల మార్కును అందుకున్నాయి. ఈ రోజు కూడా పరుగుల వరద పారే అవకాశం ఉంది.

తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్ (కీపర్), స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజూ శాంసన్, రాబిన్ ఊతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, టామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, అంకిత్ రాజ్‌పూత్, జయదేవ్ ఉనద్కత్.

కోల్‌కతా నైట్ రైడర్స్: శుభమ‌న్ గిల్, సునీల్ నరైన్, దినేశ్ కార్తీక్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ రానా, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, కమలేష్ నాగర్ కోటీ, పాట్ కమిన్స్, శివమ్ మావి, కుద్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

Story first published: Wednesday, September 30, 2020, 19:10 [IST]
Other articles published on Sep 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+