'19 ఏళ్ల కుర్రాడు తట్టుకోలేడు.. అతడిని ట్రోలింగ్ చేయకుండా వదిలేయండి ప్లీజ్'

హైదరాబాద్: శుక్రవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైశ్వాల్ పర్వాలేదనిపించిన విషయం తెలిసిందే. 36 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అయితే కేవలం 2 సిక్సులు, 1 ఫోర్ మాత్రమే బాదాడు. కీలక సమయంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (24)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రెండో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. ఈ మ్యాచులో యశస్వి స్ట్రైక్‌రేట్ నిరాశ కలిగించడంతో నెట్టింట్లో ట్రోలింగ్ మొదలైంది. ఈ సీజన్‌లో దారుణంగా విఫలమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్‌లతో పోలుస్తూ ఆటపట్టిస్తున్నారు.
ట్రోలింగ్ చేయకుండా:
ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా స్పందించాడు. యశస్వి జైశ్వాల్‌ను ట్రోలింగ్ చేసిన ఒక ట్వీట్‌ను రీట్వీట్ చేసి తొలుత వినయంగా చెప్పాడు. జైశ్వాల్ ఇంకా యువ క్రికెటర్, అండర్ 19 క్రికెట్ ఆడుతున్నాడు. అతడిని ట్రోలింగ్ చేయకుండా వదిలేయాలని కోరాడు. ఇలాంటి ట్రోలింగ్‌లను అంతర్జాతీయ సీనియర్ క్రికెటర్లు పెద్దగా పట్టించుకోకపోయినా.. 19 ఏళ్ల కుర్రాడికి బాధ కలిగిస్తుందని ఆకాశ్ చెప్పాడు.

ట్రోలింగ్‌కు, అత్యుత్తమ ప్రదర్శనకు పోలికే లేదు:
ఆకాశ్ చోప్రా ట్వీట్‌కు మరో నెటిజన్ స్పందించాడు. ట్రోలింగ్ చేయడం సరికాదన్నప్పుడు.. యశస్వి జైశ్వాల్ మంచి ప్రదర్శన ఎలా చేస్తాడని ప్రశ్నించాడు. దీనికి ఆకాశ్ తనదైన శైలిలో బదులిచ్చాడు. సోషల్ మీడియా ఆవిర్భావం కన్నా ముందు నుంచే క్రికెట్ ఆడుతున్నారని.. ట్రోలింగ్‌కు, అత్యుత్తమ ప్రదర్శనకు అసలు పోలికే లేదన్నాడు. ఈ సందర్భంగా మరో ట్వీట్ చేసిన చోప్రా ఆ నెటిజన్‌పై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

నువ్వేం చేశావో గుర్తు తెచ్చుకో:
19 ఏళ్ల క్రికెటర్‌ను ట్రోల్ చేసేముందు.. ఆ వయసులో నువ్వేం చేశావో గుర్తు తెచ్చుకో అని ఆకాశ్ చోప్రా ఫైర్ అయ్యాడు. నువ్వు ఆటపట్టించే యశస్వి జైశ్వాల్ ఇప్పటికే టీమిండియా తరఫున అండర్-19 ప్రపంచకప్ ఆడాడని, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడని పేర్కొన్నాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో ముంబై తరఫున డబుల్ సెంచరీ సాధించి ఎవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్నాడని గుర్తు చేశాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ కూడా ఆడుతున్నాడన్నాడు.

ఈ సీజన్‌లో 40 పరుగులు:
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన యశస్వి జైశ్వాల్ మొత్తం 40 పరుగులే చేశాడు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై సాధించిన 34 పరుగులే అత్యధిక స్కోర్. దేశవాళి క్రికెట్‌లో యశస్వకి మంచి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే యశస్వి ధాటిగా ఆడి పరుగులు చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఈ లీగ్ ఆడుతున్న జైశ్వాల్.. టోర్నీలో నిలదొక్కుకోడానికి సమయం పట్టే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications