Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: ఆర్‌సీబీ 'వాలైంటైన్స్ డే' స్పెషల్ ఏంటో తెలుసా!!

IPL 2020: Royal Challengers Bangalore announced February 14 is a big day

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) పేరు, లోగో, జెర్సీ మారబోతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో ఆర్‌సీబీ జట్టు అకౌంట్లకు సంబంధించి ప్రొఫైల్‌ పిక్చర్స్‌ ఖాళీగా కనిపించడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఆర్‌సీబీ జట్టు అకౌంట్‌ నుంచి పాత పోస్ట్‌లు అన్ని డిలీట్ చేయబడ్డాయి. దీంతో అభిమానులతో పాటు ఆర్‌సీబీ ఆటగాళ్లు కూడా షాక్‌కు గురవుతున్నారు.

కోహ్లీ ఆశ్చర్యం:

కోహ్లీ ఆశ్చర్యం:

ఆర్‌సీబీ ఆటగాళ్లు తమదైన స్టయిల్లో ఆర్‌సీబీని ప్రశ్నించగా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అయితే ఏకంగా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'ప్రొఫైల్‌ పిక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లు ఎక్కడికి వెళ్లాయి' అని యజ్వేంద్ర చహల్‌ సరదాగా ప్రశ్నించాడు. 'సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు మాయమయ్యాయి. దీనిపై కెప్టెన్‌కు ఎలాంటి సమాచారం లేదు. ఆర్‌సీబీ మీకు ఏదైనా సాయం కావాలంటే నన్ను అడగండి' అని కోహ్లీ ట్వీట్ చేసాడు. 'మా సోషల్ మీడియా ఖాతాలకు ఏం జరిగింది?. ఇది కేవలం వ్యూహాత్మక విరామం అని ఆశిస్తున్నా' అని ఏబీ డివిలియర్స్ రాసుకొచ్చాడు.

ప్రొఫైల్‌ పిక్‌ లోడ్‌ అవుతున్నట్టు:

ప్రొఫైల్‌ పిక్‌ లోడ్‌ అవుతున్నట్టు:

విరాట్ కోహ్లీ ట్వీట్‌ చేసిన కొద్దిసేపటికే ఆర్‌సీబీ తన సోషల్‌ మీడియా అకౌంట్లలలో (ఫేస్‌బుక్‌​, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌) ప్రొఫైల్‌ పిక్‌ లోడ్‌ అవుతున్నట్టు తెలిపేలా ఓ ఫొటోను ఉంచింది. దీంతో ఆర్‌సీబీ పేరులో మార్పులు చేయబోతున్నారని, అందుకే సోషల్‌ మీడియాలో ప్రొఫైల్స్‌ ఖాళీగా కనిపిస్తున్నాయని మళ్లీ ప్రచారం జోరందుకుంది.

ఫిబ్రవరి 14ను గుర్తుంచుకోండి:

ఫిబ్రవరి 14ను గుర్తుంచుకోండి:

సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలకు ఎట్టకేలకు ఆర్‌సీబీ ఫుల్‌స్టాప్ పెట్టింది. 'ఫిబ్రవరి 14 తేదీని గుర్తుంచుకోండి' అని ఆర్‌సీబీ ఓ ట్వీట్ చేసింది. 'కొత్త దశాబ్దం, కొత్త ఆర్‌సీబీ.. మీరు సిద్ధమా' అని పోస్ట్ చేసిన ఫోటోలో రాసుకొచ్చింది. దీంతో శుక్రవారం ఒక ముఖ్యమైన ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఆర్‌సీబీ తమ అభిమానులకు వాలైంటైన్స్ డే స్పెషల్ ఇవ్వనుంది. ఆర్‌సీబీ జట్టు కొత్త పేరు, కొత్త లోగో, కొత్త జెర్సీ చూసే అవకాశం ఉంది.

ముత్తూట్‌ ఫిన్‌కార్ఫ్‌తో ఒప్పందం:

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఒక్కసారైనా టైటిల్‌ను సొంతం చేసుకోలేదు. దీనికి తోడు స్థానిక అభిమానులు 'Bangalore' అని పిలవడానికి అంతగా ఆసక్తి కనబరచకపోవడం వల్లనే ఆ జట్టు పేరు మార్చబోతున్నారని ఆర్‌సీబీ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఆ ప్రచారంలో నిజమెంతుందో తెలియాలంటే ఆర్‌సీబీ నుంచి అధికార ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే. ఆర్‌సీబీ ఇటీవల ముత్తూట్‌ ఫిన్‌కార్ఫ్‌తో మూడేళ్ల స్పాన్సర్‌షిప్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

Story first published: Thursday, February 13, 2020, 17:51 [IST]
Other articles published on Feb 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+