రిషభ్ పంత్ కొంప ముంచిన అధిక బరువు.. ఆస్ట్రేలియా టూర్ నుంచి ఔట్!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్ ముగియగానే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. మూడు నెలల ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌లు ఆడనుంది. నవంబర్ 27న మొదలయ్యే ఈ టూర్ కోసం భారత జంబో జట్టు ఆసీస్‌కు వెళ్లనుంది. దుబాయ్ నుంచి సిడ్నీకి ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. అయితే ఈ పర్యటనకు వెళ్లే జంబో జట్టును టీమిండియా సెలెక్షన్ కమిటీ నేడు(అక్టోబర్ 26) ప్రకటించే అవకాశం ఉంది.

పంత్‌తో మాట్లాడిన ట్రైనర్..

పంత్‌తో మాట్లాడిన ట్రైనర్..

ఇక గాయాల కారణంగా చాలా మంది ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది. టీమిండియా యువ వికెట్ కీపర్ రిపభ్ పంత్ కూడా ఈ లాంగ్ టూర్‌కు ఎంపికయ్యే సూచనలు లేవని తెలుస్తోంది. ఈ యువ ఆటగాడికి గాయాల బెడద లేకున్నా.. అధిక బరువు కొంప ముంచినట్లు సమాచారం. లాక్‌డౌన్ కారణంగా విపరీతమైన బరువు పెరిగిన పంత్.. మైదానంలో చురుకుగా కదల్లేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫిట్‌నెస్ ట్రైనర్ నిక్ వెబ్ పంత్‌ను కలిసాడని, అతను అధికబరువుతో సతమతమవుతున్నాడని గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. సెలెక్టర్లు పంత్ ఓవర్‌ వెయిట్‌ను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని, జట్టును సెలెక్ట్ చేసే ముందు ట్రైనర్ నిక్ వెబ్‌తో మాట్లాడుతారని బీసీసీఐ వర్గాలు తెలిపాయని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

సెలెక్ట్ అయినా బెంచ్‌కే..

సెలెక్ట్ అయినా బెంచ్‌కే..

ఒకవేళ రిషభ్ పంత్ ఈ టూర్‌కు సెలెక్ట్ అయినా తుది జట్టులో ఆడటం కష్టమే. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతనే టీమిండియా ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్. గతంలో కూడా అతను వికెట్ల వెనుకాల తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. ప్రస్తుతం సారథిగా అదరగొడుతున్న రాహుల్ ఆత్మ విశ్వాసంతో ఉన్నాడు. పరిమిత ఓవర్లలో రాణిస్తే టెస్ట్ క్రికెట్‌లో కూడా రాహుల్‌కు అవకాశం దక్కవచ్చు.

టెస్ట్‌ల్లో పంత్‌కు చాన్స్..

టెస్ట్‌ల్లో పంత్‌కు చాన్స్..

ఒకవేళ రాహుల్‌కు టెస్ట్ జట్టులోకి రాకుంటే పంత్‌కు అవకాశం దక్కవచ్చు. గత ఆసీస్ పర్యటనలో పంత్ అద్భుతంగా రాణించాడు. భారత్ తరఫున సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. సీనియర్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా కన్నా అతనికే అవకాశాలు ఉంటాయి. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మాత్రం పంత్ దారుణంగా విఫలమయ్యాడు.

RCB vs CSK: అంబటి రాయుడికి దసరా సెగ.. మ్యాచ్ మధ్యలో వాష్‌రూమ్‌కు పరుగు.. ఆటకు ఆలస్యం!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Monday, October 26, 2020, 20:32 [IST]
Other articles published on Oct 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X