Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs SRH:ఇదేం బ్యాటింగ్ సామీ..ఇది టెస్ట్ మ్యాచ్ కాదు టీ20..నువ్వు కూడా కేదార్ జాదవ్‌లా తయారవ్వాయ్!

IPL 2020, RCB vs SRH: Fans Slam Gurkeerat Singh Mann over slow batting against SRH

హైదరాబాద్: శనివారం రాత్రి షార్జా వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులే చేసింది. జోష్‌ ఫిలిప్‌ (32), డివిలియర్స్‌ (24) ఫర్వాలేదనిపించారు. హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, జాసన్ హోల్డర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్‌ 14.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌ సాహా (39), జాసన్‌ హోల్డర్‌ ( 26 నాటౌట్‌) రాణించారు.

స్వల్ప స్కోర్

స్వల్ప స్కోర్

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు చేసిన బెంగళూరు స్వల్ప స్కోర్ చేసింది. పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆర్‌సీబీ.. అదికూడా అందరూ ఫామ్ అందుకున్న సమయంలో ఒక్కసారిగా చేతులెత్తేసింది. ఫామ్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్‌ (5) మూడో ఓవర్‌లో పెవిలియన్‌ చేరగా.. కాసేపటికే కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (7) ఔట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లను సందీప్‌ శర్మ తీశాడు. ఆరంభంలోనే వికెట్లు పడటంతో పవర్‌ప్లే ముగిసే సరికి బెంగళూరు 30/2తో నిలిచింది. జోష్ ఫిలిప్‌, ఏబీ డివిలియర్స్‌ క్రీజులో ఉన్నా.. హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో వేగంగా పరుగులు చేయలేకపోయారు.

24 బంతుల్లో 15 రన్స్

24 బంతుల్లో 15 రన్స్

ఫిలిప్‌, డివిలియర్స్ జోడి 43 పరుగులు జత చేసిన తర్వాత ఏబీ పెవిలియన్‌ చేరాడు. కాసేపటికి ఫిలెప్పి కూడా ఔట్‌ కావడంతో ఆర్‌సీబీ 76 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వాషింగ్టన్‌ సుందర్ ‌(21) ఫర్వాలేదనిపించడంతో ఆర్సీబీ వంద పరుగుల మార్కును దాటింది. క్రిస్‌ మోరిస్ ‌(3), ఇసురు ఉదాన (0)లను ఒకే ఓవర్‌లో హోల్డర్‌ ఔట్‌ చేశాడు. ఇక గుర్‌కీరత్‌ సింగ్‌ మాన్ క్రీజులో ఉన్నా ఉపయోగం లేకపోయింది. 12వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన గుర్‌కీరత్‌ ఒక్క భారీ షాట్ ఆడలేదు. 24 బంతుల్లో 15 రన్స్ చేశాడు. అది కూడా ఇన్నింగ్స్ చివరివరకు క్రీజులో ఉండి.

చివరి ఓవర్లో 4 పరుగులే

చివరి ఓవర్లో 4 పరుగులే

మరి ముఖ్యంగా గుర్‌కీరత్‌ చివరి ఓవర్లో పూర్తిగా తేలిపోయాడు. ఆఖరి ఓవర్‌ను టీ నటరాజన్ బౌలింగ్ చేశాడు. మొదటి బంతిని మహమ్మద్ సిరాజ్ ఆడాడు. షాట్ ఆడే ప్రయత్నం చేసినప్పటికీ బంతి కనెక్ట్ కాలేదు. అయితే గుర్‌కీరత్‌ రన్ తీశాడు. ఆ తర్వాత రెండు, బంతులను గుర్‌కీరత్‌ బీట్ చేశాడు. ఇక నాలుగో బంతికి సింగిల్ తీశాడు. ఐదో బంతికి సిరాజ్ సింగిల్ తీశాడు. ఆరో బంతికి లెగ్ బైస్ రూపంలో మరో సింగిల్ వచ్చింది. మొత్తం 4 పరుగులే వచ్చాయి. దీంతో ఓవర్లో అతడి బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేదార్ జాదవ్‌లా బంతులను తిన్నావ్

మహమ్మద్ సిరాజ్ నుంచి కావాలనే స్ట్రైక్ తీసుకొని గుర్‌కీరత్‌ ఆడింది ఇదేనా అంటూ ఆర్‌సీబీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నువ్వు కూడా కేదార్ జాదవ్‌లా బంతులను తిన్నావంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇది టెస్ట్ మ్యాచ్ కాదు.. టీ20 అంటూ జోకులు పేల్చుతున్నారు. 'నువ్వు దేవుడు', 'ఆర్‌సీబీకి ఇదో పీడకల', 'గుర్‌కీరత్‌ బ్యాట్స్‌మన్‌ లేదా బౌలర్', 'గుర్‌కీరత్‌ వికెట్‌ను ఎవరూ తీసుకోలేరు' అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

Story first published: Sunday, November 1, 2020, 8:01 [IST]
Other articles published on Nov 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+