RCB vs RR Preview: అభిమానులకు డబుల్ ధమాకా.. బెంగళూరు vs రాజస్థాన్.. మూడో విజయం ఎవరిది!!

హైదరాబాద్: ఐపీఎల్ 2020 మొదలై రెండు వారాలైంది. సిక్సర్లు, ఫోర్లతో మైదానాల్లో పరుగుల వరద పారుతుంది. సెంచరీ కూడా నమోదైంది. బౌలర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే రెండు సూపర్ ఓవర్ మ్యాచ్‌లు అయ్యాయి. ఇన్నీ జరుగుతున్నా.. ఎక్కడో ఏదో వెలితి. అదే డబుల్ మ్యాచ్‌ల హంగామా. ఈరోజుతో ఆ వెలతి తీరబోతోంది. ఇకపై శని, ఆదివారాల్లో రెండు మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను అలరించనున్నాయి. తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.
మధ్నాహ్నం 3.30గంటలకు మొదలయ్యే తొలి మ్యాచ్‌లో బెంగళూరు, రాజస్థాన్ తలపడనున్నాయి. ముంబైపై వచ్చిన గెలుపుతో బెంగళూరు ఉత్సాహంగా కనిపిస్తోంది. రాజస్థాన్‌పై గెలిచి అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు రాజస్థాన్ రెండు విజయాల జోరుకు బ్రేక్ పడింది. దీంతో బెంగళూరుపై విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని రాజస్థాన్ భావిస్తోంది. చెరో రెండు విజయాలతో సమానంగా ఉన్న రెండు జట్ల బలాబలాలేంటో ఓసారి చూద్దాం.

డివిలియర్స్ ఒంటరి పోరు:
బెంగళూరు జట్టులో ఓపెనర్లు ఆరోన్ ఫించ్, దేవదత్ పడిక్కల్ మంచి ఆరంభాలు ఇస్తున్నారు. మిడిల్ ఆర్డర్‌లో ఏబీ డివిలియర్స్ ఒంటరి పోరు చేస్తున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ అందుకుంటే ఆ జట్టు బ్యాటింగ్ మరింత బలంగా మారుతుంది. గత మ్యాచులో చెలరేగిన శివమ్ దూబె మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. బౌలింగ్‌లో నవదీప్ సైనీ పదునైన బంతులతో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే వికెట్ తీసుకున్నప్పటికీ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడమ్ జంపా కాస్త తడబడ్డట్లు కనిపించాడు. అతను కూడా మంచి లయతో బౌలింగ్ చేసి యుజ్వేంద్ర చహల్‌కు తోడైతే ఆ జట్టుకు తిరుగుండదు.

బ్యాటింగ్ భారం వారిపైనే:
రాజస్థాన్ జట్టులో బ్యాటింగ్ భారం మొత్తం కెప్టెన్ స్టీవ్ స్మిత్, సంజు శాంసన్లే మోస్తున్నారు. వీరు తప్పితే భారీ ఇన్నింగ్స్ ఆడే మరో బ్యాట్స్‌మెన్ కనిపించడం లేదు. తొలి మ్యాచ్‌లో యశశ్వీ జైస్వాల్ రాణించినా.. గత రెండు మ్యాచుల్లో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. రాహుల్ తెవాటియ పర్వాలేదనిపిస్తున్నాడు. జోస్ బట్లర్ కేవలం ఒకటే మ్యాచ్ ఆడాడు. స్టార్ బౌలర్ జొఫ్రా ఆర్చర్ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడం కలిసొచ్చే అంశం. టామ్ కరన్ మాత్రం భారీగా పరుగులిస్తున్నాడు. భారత పేసర్లు జయ్‌దేవ్ ఉనద్కత్, అంకిత్ రాజ్‌పుత్ మంచి ప్రదర్శన చేస్తే రాజస్థాన్‌కు విజయం ఖాయమే.

రాజస్థాన్‌దే పైచేయి:
ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 20 సందర్భాల్లో తలపడ్డాయి. అందులో 10 విజయాలతో రాజస్థాన్‌దే పైచేయి. మరో 8 మ్యాచుల్లో బెంగళూరు విజయం సాధించింది. రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అబుదాబి పిచ్ బ్యాట్స్‌మన్‌కు అనుకూలం. గత రెండు మ్యాచులో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే ఛేదనలో ఢిల్లీ, పంజాబ్ ఓటమిపాలయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై, హైదరాబాద్ గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

జట్లు అంచనా:
బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, ఏబీ డివిలియర్స్, శివమ్ దూబె, గుర్కీరత్ మన్‌సింగ్, ఇసురు ఉడాన, వాషింగ్టన్ సుందర్, ఆడమ్ జాంపా, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చహల్.
రాజస్థాన్: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), యశశ్వీ జైశ్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్, టామ్ కరన్, జొఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, జయదేవ్ ఉనద్కత్.
CSK vs SRH: చిరుతలా పరుగెత్తే ధోనీ అలసిపోయాడు.. ఇన్నింగ్స్ చివర్లో ఎందుకంత ఇబ్బంది?.. కారణం ఇదే!!
https://telugu.mykhel.com/cricket/csk-vs-srh-ms-dhoni-explains-why-he-was-coughing-in-the-last-two-overs-030643.html
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications