For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs KXIP: రఫ్ఫాడించిన రాహుల్.. గేల్‌ జిగేల్.. ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం

IPL 2020, RCB vs KXIP: KL Rahul, Chris Gayle star as KXIP hammer RCB by 8 wickets
IPL 2020: Washington Sundar Reveals MS Dhoni’s Contribution Behind His Improved Show|Oneindia Telugu

షార్జా: గురువారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అద్భుత విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పంజాబ్‌ ఎట్టకేలకు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. చివరి ఓవర్లో ఉత్కంఠ నెలకొన్నా.. నికోలస్ పూరన్ సిక్స్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ ‌(61 నాటౌట్:‌ 49 బంతుల్లో 1 ఫోర్ 5 సిక్సర్లు), క్రిస్ ‌గేల్‌ (53: 45 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లు) మెరుపు అర్ధ శతకాలతో రాణించారు. బెంగళూరు బౌలర్లలో యుజ్వేంద్ర చహల్ ఒక్క వికెట్ తీశాడు.

మయాంక్ దూకుడు

మయాంక్ దూకుడు

171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు కెప్టెన్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మంచి ఆరంభాన్ని అందించారు. రాహుల్ ( 61 నాటౌట్)‎, అగర్వాల్ (25 బంతుల్లో నాలుగు ఫోర్లు, 3 సిక్సర్ల)తో ఆరంభం నుంచే బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. అగర్వాల్ ఎడాపెడా ఫోర్లు బాదేయగా.. రాహుల్ కూడా నెమ్మదిగా జోరందుకున్నాడు. అయితే 8వ ఓవర్ చివరి బంతికి 78 రన్స్ వద్ద అగర్వాల్ పెవిలియన్ చేరాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన క్రిస్‌ గేల్ క్రీజులో కుదురుకునేందుకు చాలా సమయం తీసుకున్నాడు. తొలి 15 బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేశాడు.

గేల్‌ జిగేల్

గేల్‌ జిగేల్

ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాది టచ్‌లోకి వచ్చిన విండీస్ వీరుడు గేల్.. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఓ సిక్స్ బాదాడు. మరోవైపు రాహుల్ అర్ధ శతకం పూర్తి చేశాడు. ఇక ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో సుందర్‌ బౌలింగ్‌కి రాగా.. మరోసారి గేల్ రెండు సిక్సర్లు బాదేసి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దెబ్బకి మ్యాచ్ కూడా 161/1తో పంజాబ్ చేతుల్లోకి వచ్చేసింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన క్రిస్ మోరీస్ 4 పరుగులే ఇవ్వగా.. 19వ ఓవర్‌లో ఉరుసు ఉదాన 5 రన్స్ ఇచ్చాడు. దాంతో చివరి ఓవర్‌లో ఉత్కంఠ నెలకొంది.

చివరి బంతికి సిక్సర్

చివరి బంతికి సిక్సర్

చివరి ఓవర్‌లో యుజ్వేంద్ర చహల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. తొలి రెండు బంతులు డాట్‌ బాల్స్‌ పడగా.. మూడో బంతికి క్రిస్ గేల్‌ సింగిల్‌ తీశాడు. ఇక నాలుగో బంతికి కేఎల్ రాహుల్‌ పరుగు చేయలేడు. ఐదో బంతికి షాట్‌ ఆడి రాహుల్ పరిగెత్తాడు. అయితే గేల్‌ పరుగులో వేగం తగ్గడంతో రనౌటయ్యాడు. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీస్తుందేమో అనే సందేహం కలిగింది. కానీ చివరి బంతికి హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ ‌(6) సిక్సర్‌ బాదడంతో పంజాబ్‌ ఊపిరి పిల్చుకుంది. ఈ విజయంతో పంజాబ్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి.

కోహ్లీ ఒంటరి పోరాటం

కోహ్లీ ఒంటరి పోరాటం

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‎కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ (18), ఆరోన్ ఫించ్ (20) త్వరగానే పెవిలియన్ బాట పట్టారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (48: 39 బంతుల్లో 3ఫోర్లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేయడంతో సాధారణ స్కోరు సాధించింది. క్రిస్‌ మోరీస్‌ (25 నాటౌట్‌; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) ధనాధన్‌ బ్యాటింగ్‌తో జట్టు స్కోరును 170 దాటించాడు. శివమ్‌ దూబే (23) ఫర్వాలేదనిపించారు. పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ (2/45), మురుగన్‌ అశ్విన్‌ (2/23) తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Story first published: Friday, October 16, 2020, 11:19 [IST]
Other articles published on Oct 16, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+