RCB vs DC: విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. తొలి భారతీయుడిగా రికార్డుల్లోకి!!

దుబాయ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ క్యాపిట్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ పది పరుగులు చేయగానే.. టీ20ల్లో 9 వేల రన్స్ మైలురాయిని చేరుకున్నాడు. దీంతో టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లీ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. మొత్తంగా టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. హర్షల్ పటేల్ వేసిన ఐదో ఓవర్ మొదటి బంతికి కోహ్లీ బౌండరీ బాది 9 వేల రన్స్ మార్కును అందుకున్నాడు.

తొలి భారతీయుడిగా:
టీ20ల్లో 9వేల పరుగుల మైలురాయి అందుకున్న జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (13296) టాప్‌లో ఉండగా.. కీరన్ పొలార్డ్ (10370), షోయబ్ మాలిక్ (9926), బ్రెండన్ మెకకల్లమ్ (9922), డేవిడ్ వార్నర్ (9451), ఆరోన్ ఫించ్ (9148) విరాట్ కోహ్లీ కన్నా ముందున్నారు. కోహ్లీ తర్వాత భారత తరఫు రోహిత్ శర్మ (8818) రన్స్‌తో ఉన్నాడు. ఈ సీజన్‌లో అతను మరో 182 పరుగులు చేస్తే.. 9కే క్లబ్‌లో చేరనున్నాడు. ఈ ఇద్దరి తర్వాత సురేశ్ రైనా 8000 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

రెండో క్రికెటర్‌గా:
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 181 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ.. 5502 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 5 వేల పరుగుల మైలురాయిని చేరిన రెండో క్రికెటర్‌గా కోహ్లీ ఘనతను అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్లబ్‌లో సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే చేరారు. ఓవరాల్ టీ20ల్లో 271 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 41.05 యావరేజ్, 134.25 స్ట్రైక్ రేట్‌తో 9016 పరుగులు చేశాడు. ఇందులో ఐదు శతకాలు కూడా ఉన్నాయి.

అర్ధ శతకం దిశగా:
ఐపీఎల్ 2020లో ఇప్పటివరకు విఫలమయిన విరాట్ కోహ్లీ.. గత మ్యాచులో హాఫ్ సెంచరీ చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. 41 బంతుల్లో అర్ధశతకాన్నందుకున్నాడు. ఈరోజు కూడా బాగానే ఆడుతున్నాడు. అర్ధ శతకం దిశగా దూసుకెళుతున్నారు. ఇప్పటివరకు నాలుగు ఆడిన ఆర్‌సీబీ మూడు విజయాలు సాధించింది.

మరో ప్రపంచ రికార్డు:
టీమిండియా రన్ మెషిన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డు కూడా బ్రేక్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో టాస్ వేయడంతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. బెంగళూరు తరఫున విరాట్ 197వ మ్యాచ్‌కు హాజరయ్యాడు. దీంతో ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ హిల్డ్రెత్‌ను అధిగమించాడు. సోమర్‌సెట్ తరఫున హిల్డ్రెత్ 196 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. హిల్డెత్ తర్వాత ఎంఎస్ ధోనీ, సమిత్ పటేల్ మూడో స్థానంలో ఉన్నారు. ఇద్దరూ వరుసగా చెన్నై సూపర్ కింగ్స్, నాటింగ్హామ్ షైర్ జట్లకు189 మ్యాచులు ఆడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications