వరుసగా 19 మ్యాచ్‌లు.. కనీసం ఒక్కో వికెట్.. ఐపీఎల్ చరిత్రలో రబాడ అరుదైన రికార్డు!!

దుబాయ్: ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సోమవారం మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో ఢిల్లీ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో స్టార్ పేసర్ కాగిసో రబాడ (4/24) ధాటికి బెంగళూరు 20 ఓవర్లలో 137 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (43; 39 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్ ) మాత్రమే పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా పేసర్ రబాడ నిప్పులు చెరిగే బంతులతో బెంగళూరు బ్యాట్స్‌మన్‌కు చుక్కలు చూపించాడు. తన కోటా 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి 24 రన్స్ ఇచ్చాడు.

వినయ్ కుమార్ సరసన:
ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కగిసో రబాడ రెచ్చిపోతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 12 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 2019, 2020 సీజన్లలో వరుసగా 19 మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కో వికెట్ తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. దీంతో భారత పేసర్ వినయ్ కుమార్ సరసన చేరాడు. 2012-2013 సీజన్లలో వినయ్ కుమార్ వరుసగా 19 మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కో వికెట్ తీశాడు. తర్వాతి మ్యాచులో రబాడ మరో వికెట్ తీస్తే.. వినయ్‌కుమార్‌ను కూడా అధిగమించి.. టాప్‌లోకి దూసుకొస్తాడు.

4 ఓవర్లు.. 4 వికెట్లు:
కగిసో రబాడ గతేడాది బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లోనూ అత్యుత్తమ గణంకాలు నమోదు చేశాడు. ఆ టోర్నీ 20వ మ్యాచ్ సందర్భంగా తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 149/8 స్కోర్ చేసింది. రబాడ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దాంతో బెంగళూరు తక్కువ స్కోరుకే పరిమితమైంది. అప్పుడు కూడా విరాట్ కోహ్లీ (41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రబాడ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. తర్వాత ఏబీ డివిలియర్స్ (17), అక్షదీప్‌నాథ్ (19), పవన్ నేగి (0)లను కూడా రబాడ ఔట్ చేశాడు. ఛేదనలో శ్రేయస్ అయ్యర్ (67) అర్ధ శతకంతో రాణించడంతో ఢిల్లీ సునాయాస విజయం సాధించింది.

రెండోసారి కూడా రబాడకే చిక్కిన కోహ్లీ:
సోమవారం జరిగిన మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ మరోసారి చెలరేగడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. తొలుత ఢిల్లీ 196 పరుగులు చేయగా.. తర్వాత కోహ్లీసేన 137/9 పరుగులే చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీని (43) మరోసారి రబాడనే పెవిలియన్‌కు పంపాడు. వాషింగ్టన్ సుందర్ (17), శివమ్ దూబె (11), ఉరుసు ఉడాన (1)ను సైతం ఔట్ చేశాడు. దాంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యుత్తమ గణంకాలు నమోదు చేశాడు. 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

రెండు సీజన్లలోనూ:
2019, 2020 రెండు సీజన్లలోనూ కగిసో రబాడ బెంగళూరును చిత్తుచేశాడు. నాలుగేసి వికెట్లతో చెలరేగి సత్తాచాటాడు. మొత్తానికి రబాడ బెంగళూరునే టార్గెట్ చేశాడు. కాగా గతేడాది మొత్తం 12 మ్యాచ్‌లు ఆడిన రబాడ 25 వికెట్లతో టోర్నీలో రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ప్రస్తుతం 5 మ్యాచ్‌ల్లోనే 12 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అతడి తర్వాత యుజువేంద్ర చహల్, ట్రెంట్ బౌల్ట్ ఎనమిదేసి వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో ఈసారి రబాడ పర్పుల్ క్యాప్ అందుకునే అవకాశం ఉంది.
MI vs RR: నాలుగేసిన బుమ్రా.. ముంబై చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన రాజస్థాన్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications