న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs CSK: మాకు స్కార్క్ కనిపించింది.. మహీ భాయ్ మీకు మరి!! మొన్న తిట్టిన వారే ఇవాళ పొగుడుతున్నారు!

IPL 2020, RCB vs CSK: #Spark Trends on Twitter After Ruturaj Gaikwads Fifty, Fans praises
IPL 2020 : Ruturaj Gaikwad Shuts His Trollers, Finally Shows 'Spark', | Chennai Super Kings

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. చెన్నై ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. చెన్నై సారథి ఎంఎస్ ధోనీ నిర్ణయాలే జట్టు ఓటమికి కారణమని, ఫామ్‌లో లేని సీనియర్ ఆటగాళ్లకు పదే పదే అవకాశాలిచ్చి మూల్యం చెల్లించుకున్నాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడంపై కూడా కొందరు మండిపడ్డారు. ఇటీవల ఓ మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని ధోనీ ముందు ప్రస్తావించగా.. తమ యువ ఆటగాళ్లలో స్పార్క్ కనిపించలేన్నాడు.ధోనీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.

IPL 2020: రాజస్థాన్ విజయం.. ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి!!IPL 2020: రాజస్థాన్ విజయం.. ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి!!

ఆటాడుకున్న నెటిజన్లు:

ఆటాడుకున్న నెటిజన్లు:

ముంబైతో జరిగిన మ్యాచ్‌ల్లో సీనియర్లు కేదార్ జాదవ్, పీయుష్ చావ్లాను పక్కనబెట్టిన ఎంఎస్ ధోనీ.. యువ క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్, ఎన్‌ జగదీశన్‌కు అవకాశం ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో వీరిద్దరు డకౌట్ అయ్యారు. దీంతో ఇద్దరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నెటిజన్లు ఆటాడుకున్నారు. ధోనీ చెప్పినట్లుగానే వారిలో స్పార్క్ కనిపించలేదని, ఆడాలన్న కసి కాదుగా.. ఓపిక కూడా లేదని దుమ్మెత్తిపోశారు. ధోనీకి మద్దతుగా సోషల్ మీడియాలో ట్వీట్ల మోత మోగించారు.

మొన్న రుతురాజ్‌ను తిట్టిన వారే:

మొన్న రుతురాజ్‌ను తిట్టిన వారే:

ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోసారి రుతురాజ్, జగదీశన్‌కు అవకాశమిచ్చాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం రుతురాజ్ అద్భుతంగా ఆడాడు. అందివచ్చిన అవకావాన్ని వినియోగించుకున్నాడు. 51 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫాఫ్ డుప్లెసిస్ (25), అంబటి రాయుడు (39)లతో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఆపై ధోనీతో కలిసి చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. దాంతో మొన్న రుతురాజ్‌ను తిట్టిన వారే ఇవాళ పొగుడుతున్నారు. #Spark హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కుర్రాళ్లలో ఇప్పుడు స్కార్క్ కనిపించిందని కామెంట్స్ చేస్తున్నారు.

స్కార్క్ ఇన్నింగ్స్ అంటే ఇదే:

స్కార్క్ ఇన్నింగ్స్ అంటే ఇదే:

హాఫ్ సెంచరీ బాదిన రుతురాజ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. 'స్కార్క్ కనిపించింది' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. 'స్కార్క్ ఇన్నింగ్స్ అంటే ఇదే' మరొకరు ట్వీటారు. కుర్రాళ్లకు అవకాశాలిస్తే అద్భుతంగా రాణిస్తారని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రెండు మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన పక్కన పెట్టకూడదని.. కొన్ని ఛాన్స్‌లు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇంకొందరు ధోనీని విమర్శిస్తున్నారు. 'ధోనీ.. ఇప్పటికైనా నీకు స్కార్క్ కనిపించిందా?' అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Story first published: Monday, October 26, 2020, 9:42 [IST]
Other articles published on Oct 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X