Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూడు మ్యాచ్‌లకే మూడొచ్చేసిందా?: ఆ కర్ణాటక క్రికెటర్ టాప్‌లెస్ షో: రూ.20 లక్షలతో

IPL 2020: RCB star Devdutt Padikkal showcase his biceps, Photo goes viral on social media

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో ఈ సారి యంగ్ క్రికెటర్ల హవా నడుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయని యంగ్ క్రికెటర్లు, ఒకటో, వన్డే ఇంటర్నేషనల్ (ఓడీఐ)లను ఆడిన కొత్త ప్లేయర్లు.. ఐపీఎల్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. టీమిండియా భవిష్యత్తు క్రికెట్ స్టార్లుగా ఎదుగుతున్నారు. ఈ క్రమంలో ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు వారంతా. అసాధ్యం అనిపించే క్యాచ్‌లను పడుతున్నారు.

 యంగ్ టర్క్‌లదే రాజ్యం..

యంగ్ టర్క్‌లదే రాజ్యం..

బ్యాటింగ్‌లో భారీ షాట్ల ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. బౌలింగ్ విభాగంలోన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్.. దేవదత్ పడిక్కల్ ఈ లిస్ట్‌లో టాప్ ఫైవ్‌లో ఉంటాడు. ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లల్లో రెండు హాఫ్ సెంచరీలను సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడతను. రెండో మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ.. తొలి, మూడో మ్యాచ్‌లో జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు.

దేవదత్ పడ్డికల్ ప్రైజ్ ఎంతో తెలుసా?

మూడు మ్యాచుల్లో కలిపి 111 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 37.00, స్ట్రైక్ రేట్ 132.14. అత్యధిక స్కోరు 56 పరుగులు. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తోన్న దేవదత్ పడిక్కల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ. భారీ రేటుకు కొనుగోలు చేసి ఉంటుందని అనుకుంటే పొరపాటే.. 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్‌కే అతణ్ని జట్టులోకి తీసుకుంది ఆర్సీబీ. బేస్ ప్రైజ్‌‌కే రాయల్ ఛాలెంజర్స్ జట్టులో స్థానం దక్కించుకున్న అతను.. సుదీర్ఘకాలం పాటు టీమ్‌లో ఆడగలననే సంకేతాలను పంపించాడు.

తాజాగా మరోసారి వార్తల్లోకి..

తాజాగా మరోసారి వార్తల్లోకి..

ఇప్పటిదాకా తన బ్యాటింగ్ స్టైల్‌తో వార్తల్లోకి ఎక్కిన దేవదత్ పడిక్కల్.. తాజాగా టాప్‌లెస్‌గా కనిపించాడు. మ్యాచ్ విరామం సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలో టీమ్ బస చేసిన హోటల్ స్విమ్మింగ్‌పూల్‌లో సేద తీరుతూ కనిపించాడతను. స్విమ్మింగ్‌పూల్ స్నానం చేస్తోన్న ఫొటోను దేవదత్.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. రికవరీ మోడ్ అంటూ కామెంట్ రాసుకొచ్చాడు. ఈ ఫొటో కాస్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. దేవదత్ పడిక్కల్ టాప్‌లెస్‌గా కనిపించిన ఫొటోపై తెగ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

రాజస్థాన్ రాయల్స్‌తో..

రాజస్థాన్ రాయల్స్‌తో..

ఐపీఎల్-2020 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్.. తన నాలుగో మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ఆడబోతోంది. శనివారం అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచ్‌లల్లో రెండింట్లో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ టీమ్. రాజస్థాన్ రాయల్స్ పరిస్థితీ అంతే. ఆడిన మూడు మ్యాచ్‌లల్లో ఒక మ్యాచ్‌లో పరాజయం పాలైంది. బుధవారం రాత్రి కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో దేవదత్ పడ్డికల్ తన జోరును కొనసాగిస్తాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Story first published: Thursday, October 1, 2020, 10:43 [IST]
Other articles published on Oct 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+