కోహ్లీ పర్ఫెక్ట్ ఫిజిక్‌.. యాబ్స్‌ను చూసి అందరూ ఫిదా (వీడియో)

ముంబై: ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన ఆటగాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. శారీరక దృఢత్వంపై అతడికి ఎనలేని నమ్మకం. జట్టు సభ్యులంతా రెండు గంటలు కసరత్తులు చేస్తే.. కోహ్లీ నాలుగు గంటల వరకు చేస్తాడు. ఎక్కువ సేపు జిమ్‌లో గడుపుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతడిని చూసి మిగతా భారత క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. కోహ్లీని చూసి జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మనీష్ పాండే, మొహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ కూడా సిక్స్ పాక్ చేసారు.

 మరింత పెంచిన ప్రాక్టీస్:

మరింత పెంచిన ప్రాక్టీస్:

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించడంతో గత మార్చి నుంచి ఇంటికే పరిమితమైన విరాట్ కోహ్లీ.. ప్రతిరోజు ఇంట్లోని జిమ్‌లో చెమటోడ్చుతున్నాడు. నాలుగు నెలలకు పైగా దొరికిన ఈ ఖాళీ సమయంలో కోహ్లీ ఫిట్‌నెస్ మరింత మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఇటీవలే క్లిష్టతరమైన 180 డిగ్రీ ల్యాండింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌ కూడా చేసాడు. ఇక ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2020 తేదీలు ఖరారు అయిన నేపథ్యంలో ప్రాక్టీస్ మరింత పెంచాడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి.

 చొక్కా లేకుండానే:

చొక్కా లేకుండానే:

తాజాగా విరాట్‌ కోహ్లీ ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందులో చాలా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంతేకాదు అత్యంత ఫిట్‌గా ఉండే కోహ్లీ దేహాన్ని మనం చూడొచ్చు. ట్రెడ్‌మిల్‌పై చొక్కా లేకుండానే విరాట్ పరుగెత్తాడు. దాంతో అతడి యాబ్స్‌ను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు విరాట్ గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత క్రికెట్‌ జట్టును ఫిట్‌నెస్‌ పరంగా ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత శంకర్‌ బసూదే. కోహ్లీ, బుమ్రా వంటి క్రికెటర్లను ఫిట్‌నెస్‌ పరంగా కూడా టాప్‌లో నిలిపిన వ్యక్తి శంకర్‌ బసూ.

ఫిట్‌నెస్‌ సాధించే పనిలో:

ఫిట్‌నెస్‌ సాధించే పనిలో:

లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉండిపోయిన క్రికెటర్లు ఐపీఎల్ తేదీలు ప్రకటించడంతో సాధన మొదలుపెట్టారు. చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టె ఎంఎస్‌ ధోనీ, ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ ఇంటివద్దే కసరత్తులు చేస్తున్నారు. స్థానిక మైదానాలు అందుబాటులో ఉన్నవారు అక్కడికే వెళ్లి సాధన చేస్తున్నారు. సురేశ్‌ రైనా, రిషభ్‌ పంత్‌, ఇషాంత్‌ శర్మ, పియూష్‌ చావ్లా‌, మహ్మద్‌ షమీ ఘాజియాబాద్‌లోని మైదానంలో శ్రమిస్తున్నారు. నెల రోజులకు పైగా సమయం ఉండటంతో క్రికెటర్లు అందరూ ఫిట్‌నెస్‌ సాధించే పనిలో పడ్డారు.

180 డిగ్రీ ల్యాండింగ్ ఎక్స్‌ర్‌సైజ్:

విరాట్ కోహ్లీ ఇటీవల తన ఇంటోనే క్లిష్టతరమైన 180 డిగ్రీ ల్యాండింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌ చేసాడు. కాలి మడమ (కుడి)పై శరీరం బరువు మొత్తాన్ని మోపి.. ఆ తర్వాత 180 డిగ్రీ కోణంలో గాల్లోకి ఎగిరి మళ్లీ ఒంటి కాలి మడమ (ఎడమ)పై ల్యాండ్ అయ్యాడు. ఈ ఎక్స్‌ర్‌సైజ్‌ చూడడానికి సులువుగా అనిపించినా.. ప్రాక్టికల్‌గా చేయడం మాత్రం చాలా కష్టం. సరైన ప్రాక్టీస్ లేకపోతే గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అథ్లెట్స్‌కి పాత మడమ గాయాలేమైనా ఉంటే? అవి తిరగబడే ఛాన్స్ ఉంది. అందుకే ఈ ల్యాండింగ్‌ని 'టాప్ ఎక్సర్‌సైజ్' అంటారు. ఇక్కడ కోహ్లీ మాత్రం ఈ టాప్ ఎక్సర్‌సైజ్‌ను సులువుగా చేసాడు.

మళ్లీ బ్యాట్‌ పట్టిన ధోనీ.. మైదానంలో సిక్సుల మోత!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, August 7, 2020, 12:49 [IST]
Other articles published on Aug 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X