న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK: జియో ప్రకటన కోసం.. జడేజా, జాదవ్ డాన్స్ (వీడియో)

IPL 2020: Ravindra Jadeja posts dance video of his CSK teammates

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సందడి మెుదలైంది. అభిమానులు ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా టోర్నీ మరో నాలుగు రోజుల్లో మెుదలుకానుంది. లీగ్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్‌ 19న రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెడింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరగనుంది. ఇప్పటికే లీగ్‌లో పాల్గొనే జట్లన్నీ తమ ప్రాక్టీస్‌లో పూర్తిగా నిమగ్నమయ్యాయి. ఈసారి ఐపీఎల్‌లో మ్యాచ్‌లన్నీ షార్జా, దుబాయ్‌, అబుదాబి వేదికగా జరగనున్నాయి.

ఐపీఎల్ ఆటగాళ్లు ఒకవైపు ప్రాక్టీస్‌ చేస్తూ.. మరోవైపు షూట్‌లలో పాల్గొంటున్నారు. తమ తమ జట్ల స్పాన్సర్‌ల కోసం యాడ్ షూట్‌లలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టు అసోసియేట్ స్పాన్సర్‌ జియో కోసం.. ఆ టీమ్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, పీయూష్ చావ్లాలు యాడ్ షూట్‌లో పాల్గొన్నారు. షూట్‌లో భాగంగా ముగ్గురు కలిసి డాన్స్ చేశారు. దీనికి సంబందించిన వీడియోను జడేజా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'నా సహచరులలో దాగి ఉన్న నైపుణ్యాలు' అని కాప్షన్ జత చేశాడు.

రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడు. జట్టులో కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాట్, బంతితో ఆదుకుంటాడు. చాలా ఏళ్లుగా చెన్నై జట్టుకే ఆడుతున్నాడు. జడేజా ఐపీఎల్‌లో 170 మ్యాచ్‌లు ఆడి 24 సగటుతో 1,927 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 122.66 గా ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో జడేజా 110 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ రేటు కేవలం 7కి పైగా ఉంది. గతంలో జరిగిన వేలంలో జడేజాను చెన్నై అట్టిపెట్టుకుంది.

ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళ్లిన చెన్నై సూపర్ ‌కింగ్స్‌ జట్టును ఇప్పట్లో కరోనా వైరస్ వదిలేలా కనిపించట్లేదు. చెన్నై యువ బ్యాట్స్‌మన్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ ఇప్పటికీ వైరస్‌తో బాధపడుతున్నాడు. 14 రోజుల క్వారంటైన్ ముగిసినా.. తాజాగా నిర్వహించిన ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో ఫలితం పాజిటివ్‌గానే వచ్చిందని సమాచారం. ప్రస్తుతం అతడు హోటల్ గదిలో ఐసోలేషన్‌లో ఉన్నాడు. దీంతో చెన్నై జట్టు ప్రణాళికలు, కూర్పులో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. స్టార్ ఆటగాడు సురేశ్‌ రైనా టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో రుత్‌రాజ్‌ను ఆడించాలన్నది సీఎస్‌కే ప్రణాళికగా తెలుస్తోంది. ఇక నెగెటివ్‌ వచ్చేదాక అతడు ప్రాక్టీస్‌ చేయలేడు. సాధన లేకుండా నేరుగా మ్యాచులోకి దించే పరిస్థితి ఉండదు.

IPL Flashback: ఐపీఎల్‌లో బ్యాటును నేలకేసి కొట్టిన సచిన్.. ఎప్పుడు, ఎందుకో తెలుసా?!!IPL Flashback: ఐపీఎల్‌లో బ్యాటును నేలకేసి కొట్టిన సచిన్.. ఎప్పుడు, ఎందుకో తెలుసా?!!

Story first published: Tuesday, September 15, 2020, 16:41 [IST]
Other articles published on Sep 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X