IPL 2020: ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి రవిచంద్రన్ అశ్విన్

హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఇప్పటినుంచే ఆటగాళ్ల ట్రేడింగ్ మొదలైంది. ఐపీఎల్ 12వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రవిచంద్రన్ అశ్విన్ రాబోయే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.
"అవును, ఇది పురోగతిలో ఉంది. ఈ డీల్‌ను ముగించేందుకు గాను కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు చెందిన ఒక డైరెక్టర్ సంతకం కోసం ఎదురుచూస్తున్నాం. మా సొంత గ్రౌండ్‌లో ఆడే మ్యాచుల్లో అతను రాణిస్తాడని జట్టు యాజమాన్యం నమ్ముతోంది" అని ఆ అధికారి తెలిపారు.

2018 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో
2018 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో రవిచంద్రన్ అశ్విన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం రూ.7.6 కోట్లకు సొంతం చేసుకుంది. అనంతరం అశ్విన్‌కు సారథ్య బాధ్యతలను సైతం అప్పగించింది. 2019 సీజన్‌లో మొత్తం 14 మ్యాచులు ఆడిన అశ్విన్ 15 వికెట్లు తీశాడు. కాగా, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ మాన్కడింగ్‌కు పాల్పడ్డాడు.

అశ్విన్‌కు పలువురు మద్దతు
ఇది ఈ సీజన్ మొత్తాన్ని ఓ కుదుపు కుదిపింది. ఈ విషయంలో పలువురు అశ్విన్‌కు మద్దతు తెలపగా... మరికొందరు అతడిపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా, అశ్విన్ ఢిల్లీ గూటికి చేరితే అతని స్థానంలో కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ అప్పగించనున్నారని తెలుస్తోంది. అశ్విన్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అజ్యింకే రహానేని కూడా తమ జట్టులోకి తీసుకొనేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది.

ఐపీఎల్‌లో 139 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్
ఐపీఎల్‌లో మొత్తం 139 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 6.79 ఎకానమీతో 125 వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్‌ను రాబోయే సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా నియమింపబడ్డారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications