Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: పప్పులో కాలేసిన ఆర్‌సీబీ.. ట్రోల్ చేసిన ఆర్‌ఆర్!!

IPL 2020: Rajasthan Royals troll Royal Challengers Bangalore for using the wrong logo

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. ముంబై వేదికగా మార్చి 29న 2020 సీజన్‌ ఆరంభం కానుంది. ఇక మే 24న ఫైనల్‌ జరగనుంది. వాంఖడే స్టేడియంలో జరిగే సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. మార్చి 29 నుంచి మే 17 వ‌ర‌కు లీగ్ ద‌శ ఉండగా.. నాకౌట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను త‌ర్వాత ప్ర‌క‌టించ‌నున్నారు. చివరి లీగ్‌ మ్యాచ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ మధ్య జరగనుంది.

పప్పులో కాలేసిన ఆర్‌సీబీ:

పప్పులో కాలేసిన ఆర్‌సీబీ:

షెడ్యూల్ అధికారికంగా విడుద‌ల కాకముందే కొన్ని జ‌ట్లు త‌మ తమ ట్విట్ట‌ర్ ఖాతాలలో షెడ్యూల్‌ను పోస్టు చేశాయి. ఇక రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) కూడా తన ట్విట్ట‌ర్ అకౌంట్‌లో తనకు సంబందించిన షెడ్యూల్‌ను పోస్ట్ చేసింది. అయితే ఇక్కడే ఆర్‌సీబీ పప్పులో కాలేసింది. ఆర్‌సీబీ తాను ఏ జ‌ట్ల‌తో ఆడ‌తామో షెడ్యూల్‌ను పేర్కొంటూ ఓ ఫొటోతో పోస్టు పెట్టింది. ఇక్కడ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్‌ఆర్) పాత లోగోను ఆర్‌సీబీ పోస్ట్ చేసింది.

ఇది మా లోగో:

ఇది మా లోగో:

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ లోగో ఇప్ప‌టికే మారిపోయిన విషయం తెలిసిందే. ఇది మర్చిపోయిన ఆర్‌సీబీ.. పాత లోగోను పోస్ట్ చేయడంతో ఆ ట్వీట్ కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అయింది. దీనిపై ఆర్‌ఆర్ సరదాగా ట్రోల్ చేసింది. 'బీసీసీఐ నుంచి అధికారిక‌మైన షెడ్యూల్ వ‌చ్చే వ‌ర‌కు ఆగుతాం. ఇది మా లోగో' అని ఆర్‌ఆర్ తన అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేసింది. అంతేకాదు కొత్త లోగో పిక్‌ను షేర్‌ చేసింది. ఈ రిప్లైపై నెటిజన్లు స‌ర‌దాగా స్పందిస్తున్నారు.

ఆర్‌సీబీ కొత్త లోగో:

ఆర్‌సీబీ కొత్త లోగో:

ఆర్‌సీబీ ఫ్రాంచైజీ కొత్త లోగోను ఆవిష్కరించింది. 'మీరు ఎదురు చూసిన క్షణం ఇదే. కొత్త ఆర్సీబీ.. కొత్త దశాబ్దం.. కొత్త లోగో అంటూ పేర్కొంది. అయితే ఆర్‌సీబీ కొత్త లోగోపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫన్నీగా రిప్లే ఇచ్చింది. 'ఈసాల లోగో చాలా బాగుంది; అంటూ బెయిర్‌ స్టో, డేవిడ్‌ వార్నర్‌ల ఫోటోను పోస్ట్‌ చేసింది.

శనివారం రెండు మ్యాచ్‌లు లేవు:

రాబోయే సీజన్‌లో ఏ ఒక్క శనివారం కూడా రెండు మ్యాచ్‌లు బీసీసీఐ నిర్వహించట్లేదు. ఇకపై కేవలం ఆదివారాల్లో మాత్రమే రెండు (4PM, 8PM) మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. లీగ్‌ దశ ఏకంగా ఆరు వారాల పాటు కొనసాగనుంది. అన్ని ఫ్రాంచైజీలు కూడా తమ సొంత మైదానాల్లోనే మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాయి. ఒక్క రాజస్థాన్‌ రాయల్స్‌ మాత్రమే జైపూర్‌ తర్వాత గువహటిని తమ రెండో హోం గ్రౌండ్‌గా ఎంపిక చేసుకుంది.

Story first published: Monday, February 17, 2020, 22:29 [IST]
Other articles published on Feb 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+