IPL 2020: దుబాయ్‌లో అడుగుపెట్టిన రాజస్తాన్, పంజాబ్.. అబుదాబీలో కోల్‌కతా!!

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం ఫ్రాంచైజీలు యూఏఈ బాటపట్టాయి. ఇప్పటికే మూడు జట్లు అక్కడికి చేరుకున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్ జట్లు గురువారం చార్టెడ్ ఫ్లయిట్‌లలో దుబాయ్ చేరుకోగా.. సాయంత్రం కోల్‌కతా నైట్‌రైడర్స్ అబుదాబీలో దిగింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు శుక్రవారం దుబాయ్‌కి బయల్దేరతాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఈ వారాంతంలో పయనం కానున్నాయి.

2014లో సగం ఐపీఎల్ మ్యాచులు:
ఐపీఎల్ 2020 మ్యాచులు వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 60 మ్యాచ్‌లు 53 రోజుల పాటు దుబాయ్, అబుదాబీ, షార్జా మూడు వేదికల్లో జరుగనున్నాయి. కొవిడ్-19 వైరస్ కోరలు చాస్తుండటంతో.. లీగ్‌ను బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో 2014లో సగం ఐపీఎల్ మ్యాచులు ఇక్కడే నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతకుముందు దక్షిణాఫ్రికాలో మ్యాచులు జరిగాయి.
ఆరు రోజుల క్వారంటైన్:
భారత దేశంలో విమానం ఎక్కేందుకు 24 గంటల ముందే రెండుసార్లు వైరస్ పరీక్షలు చేయించుకున్న ఆటగాళ్లు, సిబ్బంది, యాజమాన్యం యూఏఈలో కూడా మళ్లీ పరీక్షలు చేయించుకోనున్నారు. ఆరు రోజుల పాటు ఉండే ఏకాంతవాసంలో 1, 3 ,6 రోజుల్లో ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయించుకుంటారు. ఈ మూడింటిలో నెగెటివ్ ఫలితాలు వచ్చిన వారే జీవ రక్షణ వలయం (బయో బబుల్)లోకి వెళ్తారు. ఈ బుడగలో ఉన్నప్పటికీ.. టోర్నీ జరిగినంత కాలం ప్రతీ ఐదు రోజులకోసారి పరీక్షలుజరుగుతూనే ఉంటాయి.
బీసీసీఐ హెచ్చరిక:
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020లో పాల్గొననున్న ఆటగాళ్లు నిబంధనలను కచ్చితంగా పాటించాలని బీసీసీఐ హెచ్చరించింది. బయో సెక్యూర్ వాతావరణాన్ని కాపాడుకుంటూ మ్యాచ్‌లు ఆడాలని సూచించింది. 'ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, జట్ల యాజమాన్యాలకు నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పాం. ఎవరో ఒకరి తప్పదానికి మిగిలిన వాళ్లు ప్రమాదంలో పడొద్దనే ముందస్తుగా హెచ్చరిస్తున్నాం' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే జోఫ్రా ఆర్చర్, మొహమ్మద్ హఫీజ్ నిబంధనలను ఉల్లఘించిన నేపథ్యంలో.. బోర్డు ఐపీఎల్ ఆటగాళ్లకు ముందస్తుగానే హెచ్చరికలు జారీచేసింది.
అజారుద్దీన్ సంతోషం:
ఐపీఎల్ మళ్లీ మొదలవనుండడం సంతోషకరమైన విషయమని భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. 'బయో బబుల్ వాతావరణంలో ఇంగ్లండ్ విజయవంతంగా క్రికెట్ సిరీస్‌లు నిర్వహిస్తున్నది. ఐపీఎల్ కూడా అదే బాటలో నడుస్తుందనే నమ్మకముంది. ఐపీఎల్‌పై ఆధారపడి చాలామంది ఉన్నారు. వారికిది సంతోషకరమైన విషయం' అని గురువారం అజారుద్దీన్ పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications