రాహుల్..నామ్ తొ సునా హోగా: కోల్‌కత ఓపెనర్‌పై బాలీవుడ్ బాద్‌షా: తన ఫేమస్ డైలాగ్‌తో ఎంజాయ్

అబుధాబి: చెన్నై సూపర్ కింగ్స్‌పై సాధించిన ఘన విజయం.. కోల్‌కత నైట్ రైడర్స్ జట్టులో ఉరిమే ఉత్సాహాన్ని నింపింది. పాయింట్ల పట్టికలో టాప్-3లోకి తీసుకెళ్లింది. ఈ విజయంతో తన నెట్ రన్‌రేట్‌ను మరింత మెరుగుపరచుకోగలిగింది కేకేఆర్. ఈ మ్యాచ్‌కు ముందు వరకూ మైనస్‌లో ఉన్న కోల్‌కత జట్టు నెట్ రన్‌రేట్ ప్లస్‌లోకి వచ్చేసింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ తరువాత.. మూడో స్థానంలో నిలిచింది దినేష్ కార్తీక్ టీమ్. ఇప్పటిదాకా అయిదు మ్యాచ్‌లను ఆడిన కోల్‌కత నైట్ రైడర్స్.. మూడింట్లో విజయాన్ని చవి చూసింది.
పరిమిత స్కోరును కాపాడుకోవడంలో..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో బుధవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత ఘన విజయాన్ని అందుకుంది. బలమైన ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు పరిమిత స్కోరును లక్ష్యంగా నిర్దేశించినప్పటికీ.. దాన్ని కాపాడుకోగలిగింది. కోల్‌కత బౌలర్ల ప్రతాపానికి చెన్నై బ్యాట్స్‌మెన్లు 20 ఓవర్లలో అయిదు వికెట్లను కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేశారు. డెత్ ఓవర్లలో సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయగలిగారు.
కోల్‌కత నైట్ రైడర్స్ టీమ్‌లో రాణించిన రాహుల్..
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్ రైడర్స్ జట్టులో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి మినహా ఎవ్వరూ రాణించలేకపోెయారు. కోల్‌కత ఓ మోస్తరు స్కోరు చేయగలిగిందంటే.. దానికి కారణం అతనే. 51 బంతుల్లో మూడు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 81 పరుగులు చేశాడు త్రిపాఠి. మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఎవరూ అతని దరిదాపులకు కూడా చేరుకోలేకపోయారు. సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్ 17 చొప్పున స్కోరుబోర్డులో పరుగులను జత చేశారు. రాహుల్ త్రిపాఠి తరువాత వారిద్దరిదే టాప్ స్కోరు. 81 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
తన ఫేమస్ డైలాగ్‌తో షారుఖ్ సందడి..
కోల్‌కత నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ షారుఖ్ ఖాన్.. తన జట్టు సాధించిన విజయాన్ని ఆస్వాదించాడు. స్టేడియంలో కూర్చుని మరీ మ్యాచ్ మొత్తం తిలకించాడు. ప్రత్యేకించి- రాహుల్ త్రిపాఠి ఆడుతున్న సమయంలో షారుఖ్ చప్పట్లు కొడుతూ కనిపించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందజేసే సమయంలోనూ అతను తన ఉత్సాహాన్ని అణచుకోలేకపోయాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికైన రాహుల్ త్రిపాఠిని కామెంటేటర్ హర్షా భోగ్లే ఆహ్వానించగానే.. గట్టిగా చప్పట్లు కొట్టాడు. తన ఐకనిక్ డైలాగ్‌ను గట్టిగా పలికాడు.
రాహుల్ నామ్ తొ సునా హోగా..
రాహుల్.. నామ్ తొ సునా హోగా. బాలీవుడ్ సినిమా ప్రియులు మరిచిపోలేని డైలాగ్ అది. 1997లో విడుదలైన దిల్ తొ పాగల్ హై సినిమాలోని డైలాగ్ అది. ఆ మూవీలో షారుఖ్ క్యారెక్టర్ పేరు రాహుల్. అదే డైలాగ్‌ను అబుధాబిలోనూ పలికాడు. రాహుల్ త్రిపాఠికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందజేసే సమయంలో- రాహుల్.. నామ్ తొ సునా హోగా.. అంటూ గట్టిగా పలికాడు. దీనితో హర్షాభోగ్లే, రాహుల్ త్రిపాఠి బిగ్గరగా నవ్వడం కనిపించింది. అనంతరం- ట్వీట్లతో తన జట్టును ప్రశంసించాడు షారుఖ్ ఖాన్. అద్భుత విజయాన్ని అందుకుందని, మిగిలిన మ్యాచ్‌లల్లో ఇదే దూకుడును కొనసాగించాలని అకాంక్షించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications