
టీనేజర్లయినా వదలొద్దు:
'ఎంఎస్ ధోనీ కుమార్తెపై బెదిరింపులకు పాల్పడినందుకు ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల పనితీరు ప్రశంసించదగ్గది. ఇలాంటి వాటికి స్వస్తి పలకాల్సిన సమయం ఇది. ఇంటర్నెట్‌లో ఇష్టానుసారంగా మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకునే ఇలాంటి ముఖాలు లేని రాక్షసులకు చట్టం అంటే ఏంటో చూపించాలి. వారిలో భయం పుట్టించాలి. వాళ్లు టీనేజర్లు అయినా సరే.. ఆ రాక్షసుల్ని అస్సలు వదలొద్దు' అని ఆయన మాధనవ్ పేర్కొన్నారు.

ధోనీని బెదిరిస్తారా:
'ఎంఎస్ ధోనీ, అతడి కుటుంబంపై ఎలాంటి బెదిరింపులు వస్తున్నాయో నాకు తెలియదు. కానీ అలా చేయడం సరికాదు. అవి జరగకూడదు కూడా. భారత క్రికెట్‌ను ధోనీ అత్యున్నత శిఖరాలకు చేర్చాడు. ఎంతో మంది జూనియర్, సీనియర్ ఆటగాళ్లను తన ప్రయాణంలో తీసుకెళ్లాడు. అలాంటి అతడిపై బెదిరింపులు చేయడం భావ్యం కాదు' అని షాహిద్ అఫ్రిది పేర్కొన్నాడని పాక్ మీడియా తెలిపింది.

16 ఏళ్ల బాలుడు అరెస్ట్:
జీవాపై అసభ్యకర కామెంట్లు చేసిన 16 ఏళ్ల బాలుడిని అహ్మదాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గుజరాత్‌లోని కచ్ జిల్లా ముంద్రా ప్రాంతానికి చెందినవాడిగా రాంచీ పోలీసులు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడిని అదుపులోని తీసుకొని విచారించగా.. ఆ పోస్ట్ తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. రాంచీ పోలీసులు ఇక్కడికి వచ్చిన అనంతరం బాలుడుని వారికి అప్పగిస్తామని కచ్ జిల్లా ఎస్పీ సౌరబ్ సింగ్ తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర కామెంట్లు:
ఐపీఎల్ 2020లో భాగంగా గత బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఒకానొక దశలో గెలుపు దిశగా దూసుకెళ్లిన చెన్నై.. ఆఖర్లో తడబడి చేతులెత్తేసింది. ఎంఎస్ ధోనీ సరిగ్గా ఆడకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయిందని, మళ్లీ సరిగ్గా ఆడకపోతే జీవా ధోనీపై అత్యాచారం చేస్తానంటూ 16 ఏళ్ల బాలుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర కామెంట్లు చేశాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. పలు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు దీన్ని తీవ్రంగా ఖండించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన రాంచీ పోలీసులు నిందితుడిని గుర్తించారు.


Click it and Unblock the Notifications
