వాళ్లు భారీ హిట్టర్లు.. స్ట్రైకింగ్ వాళ్లకే ఇవ్వడానికే ప్రయత్నిస్తా: డికాక్

అబుదాబి: మిడిలార్డర్‌లో అనుభవజ్ఞులు ఉండటం ఏ జట్టుకైనా సానుకూలాంశమని ముంబై ఇండియన్స్ ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ అన్నాడు. సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాతో ముంబై మిడిలార్డర్ పటిష్టంగా ఉందని.. ఒకవేళ వాళ్లతో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశాలు వచ్చినప్పుడు స్ట్రైకింగ్ వాళ్లకే ఎక్కువగా ఇవ్వడానిని ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. మిడిలార్డర్ బలంగా ఉన్నా లేకపోయినా జట్టుకు ఘనమైన ఆరంభాలు ఇవ్వడమే ఓపెనర్‌గా తన పని అని డికాక్ చెప్పాడు. ఐపీఎల్ 2020లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచిన విషయం తెలిసిందే.

స్ట్రైకింగ్ వాళ్లకే ఇవ్వడానికే ప్రయత్నిస్తాం:
తాజాగా క్వింటన్ డికాక్ మాట్లాడుతూ... 'మిడిలార్డర్‌లో అనుభవజ్ఞులు ఉండటం ఏ జట్టుకైనా కలిసొచ్చే అంశం. కానీ అది మా ఆలోచనలను మార్చదు. బలమైన మిడిలార్డర్ ఉన్నా లేకపోయినా జట్టుకు ఘనమైన ఆరంభాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తాం. అయితే సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్, హార్దిక్ వంటి బ్యాట్స్‌మెన్ మా తర్వాత బ్యాటింగ్ చేస్తారని తెలిసినప్పుడు, దానికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేస్తాం. వాళ్లతో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశాలు వచ్చినప్పుడు స్ట్రైకింగ్ వాళ్లకే ఎక్కువగా ఇవ్వడానికే ప్రయత్నిస్తాం. ఎందుకంటే వాళ్లు భారీ హిట్టర్లు' అని తెలిపాడు.

ఈ విషయంలో పెద్ద మార్పేమి లేదు:
గాయంతో తుది జట్టుకు దూరమైన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు బదులుగా ఇషాన్ కిషన్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించడం గురించి క్వింటన్ డికాక్ మాట్లాడాడు. 'రోహిత్‌తో ఉన్న సమన్వయం ఇషాన్‌తో కూడా ఉంది. ఈ విషయంలో పెద్ద మార్పేమి లేదు. ఇషాన్ ఎంతో ప్రతిభ కలిగిన ఆటగాడు. నేను దూకుడుగా ఆడలేని పరిస్థితుల్లో అతడు అద్భుతంగా ఆడి.. నాపై ఒత్తిడి తొలగిస్తున్నాడు. భాగస్వామ్యంలో అది ఎంతో గొప్ప విషయం. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలవడానికి ప్రయత్నిస్తాం. టాపర్‌గా ఉండటమే మా లక్ష్యం కాబట్టి తర్వాత మ్యాచ్‌లు కూడా మాకు కీలకమే' అని ముంబై ఇండియన్స్ ఓపెనర్ డికాక్ చెప్పాడు.

ప్లేఆఫ్‌కి ముంబై మాత్రమే:
ఐపీఎల్ 2020 సీజన్ లీగ్ దశ ఆఖరికి చేరుకున్నా.. ఇంకా ప్లేఆఫ్ బెర్తులపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. మరో నాలుగు రోజుల్లో లీగ్ దశ ముగిసిపోనుండగా ఇప్పటి వరకూ కేవలం ముంబై ఇండియన్స్ మాత్రమే ప్లేఆఫ్‌కి అర్హత సాధించింది. మరోవైపు రేసు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించింది. ఇక మిగిలిన ఆరు జట్లలో ఏ టీమ్ ప్లేఆఫ్‌కి చేరుతుందో క్లారిటీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. శనివారం, ఆదివారంలో బెర్తులపై పూర్తి క్లారిటీ రానుంది.
IPL 2020 టైటిల్ ముంబై ఇండియన్స్ గెలవదు.. ఆ జట్లకే అవకాశం: ఎమ్మెస్కే ప్రసాద్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications