Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Qualifier 2: ఢిల్లీని కట్టడిచేయడానికి అదే మా ప్రణాళిక: రషీద్‌ ఖాన్‌

IPL 2020, Qualifier 2: Rashid Khan explains Sunrisers game plan againest Delhi Capitals

అబుదాబి: శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన ఎలిమినేటర్‌లో 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో కప్పు కొట్టడమే లక్ష్యంగా బరిలో దిగిన సన్‌రైజర్స్‌ మరో అడుగు ముందుకేసింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫైయర్-2లో వార్నర్ సేన తలపడబోతోంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్‌తో తుది పోరులో అమితుమీ తేల్చుకోనుంది. కీలక మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్లు తమతమ ప్రణాళికలపై దృష్టిపెట్టాయి.

ఆందోళనకు గురయ్యాం:

ఆందోళనకు గురయ్యాం:

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే క్వాలిఫయర్‌-2కు తాము సిద్ధంగా ఉన్నట్లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తెలిపాడు. 'ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఒక దశలో మేము కఠిన పరిస్థితిని ఎదుర్కొన్నాం. కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన రెండో అంచె మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో పరాజయం చవిచూసిన సందర్భం మళ్లీ వస్తుందా అనిపించింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ కావడంతో ఆందోళనకు గురయ్యాం. కానీ చివరకు మ్యాచ్ గెలిచాం. ఆ దేవునికి ధన్యవాదాలు' అని రషీద్‌ ఖాన్‌ పేర్కొన్నాడు.

బేసిక్స్‌ను అవలంభిస్తే చాలు:

బేసిక్స్‌ను అవలంభిస్తే చాలు:

'ఢిల్లీతో క్వాలిఫయర్‌-2కు మేము సిద్ధంగా ఉన్నాం. అబుదాబి పిచ్‌ చాలా స్లోగా ఉంటుంది. బేసిక్స్‌ను కచ్చితంగా అవలంభిస్తే సరిపోతుంది. అదే తమ ప్రణాళిక. ఇక నా ప్రదర్శన గురించి చెప్పాలంటే.. రైట్‌ లెంగ్త్‌ బాల్‌ను వేయడంపైనే దృష్టి పెట్టా. ఫుల్‌ లెంగ్త్‌ బాల్‌ను వేసినప్పుడు పరుగులు సమర్పించుకున్నానే విషయం గ్రహించా. నా వీడియోలను ఒకసారి రివీల్‌ చేసుకుంటే.. ఇదే విషయం తెలుసుకున్నా. రైట్‌ ఏరియాలో బంతుల్ని వేయడానికి కృషి చేస్తా. ఈ వికెట్‌పై కొన్ని సందర్బాల్లో ఊహించని టర్న్‌ వస్తుంది' అని హైదరాబాద్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ చెప్పాడు.

రెండు అడుగుల దూరంలో:

రెండు అడుగుల దూరంలో:

ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గొప్పగా పుంజుకున్న విషయం తెలిసిందే. వరుస ఓటములతో ఓ దశలో దాదాపు ప్లేఆఫ్ రేసు నిష్క్రమించినట్లు కనిపించిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత అద్భుత విజయాలతో రేసులోకి వచ్చింది. వరుసగా మూడు టాప్ జట్లపై విజయాలు సాధించి ప్లేఆఫ్ చేరిన వార్నర్ సేన.. గత రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి క్వాలిఫైయర్‌-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే.. వార్నర్ సేన ఫైనల్ చేరుకుంటుంది. రెండోసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గడానికి మరో రెండు అడుగుల దూరంలో ఉంది.

Story first published: Saturday, November 7, 2020, 20:32 [IST]
Other articles published on Nov 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+