Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Qualifier 2, DC vs SRH: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. రెండు మార్పులతో బరిలోకి!!

IPL 2020, Qualifier 2, DC vs SRH: Delhi Capitals have won the toss and have opted to bat

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020లో మరో ఆసక్తికర పోరుకి సమయం ఆసన్నమైంది. క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

వరుస విజయాలతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ ఫైనల్‌ బెర్తుపై కన్నేసింది. క్వాలిఫయర్‌-1లో ముంబై ఇండియన్స్‌ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. గట్టిగా పుంజుకొని తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించాలని పట్టుదలతో ఉంది. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో సంచలన విజయాలు నమోదు చేసిన వార్నర్‌సేన.. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. మరోవైపు చివరి ఆరు మ్యాచ్‌ల్లో ఐదు పరాజయాలతో ఢీలాపడిన ఢిల్లీ ఒత్తిడిని జయించి సమిష్టిగా రాణించాలనుకుంటోంది.

ఈ సీజన్‌లో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్‌దే పైచేయి అయింది. రెండు సార్లూ మొదట బ్యాటింగ్‌ చేసిన రైజర్స్‌.. తొలిసారి బౌలింగ్‌ బలంతో, రెండోసారి బ్యాటింగ్‌తో గెలిచింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌ బౌలర్లు 17 వికెట్లు పడగొడితే.. ఢిల్లీ బౌలర్లు 6 వికెట్లే తీశారు. రైజర్స్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్ ఒక్కడే 6 వికెట్లు పడ గొట్టడం కొసమెరుపు.

అబుదాబిలో జరిగిన గత తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిదింట ఛేజింగ్‌ చేసిన జట్లే గెలిచాయి. ఇక ఉత్కంఠ పోరాటాల్లో తేలిపోయే ఢిల్లీ.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఏడు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఆడి అందులో ఆరింట ఓడింది. ఆ గెలిచిన ఒక్కటి హైదరాబాద్‌పైనే కావడం క్యాపిటల్స్‌కు ఊరటనిచ్చే అంశం.

Story first published: Sunday, November 8, 2020, 19:10 [IST]
Other articles published on Nov 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+