Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Qualifier 1, MI vs DC: టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. మూడు మార్పులతో బరిలోకి ముంబై!

IPL 2020, Qualifier 1, MI vs DC: Delhi Capitals have won the toss and have opted to field

దుబాయ్‌: దుబాయ్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌-13 సీజన్‌లో ప్లేఆఫ్‌ సమరానికి రంగం సిద్ధమైంది. మరికొద్ది సమయంలో ప్రారంభం కానున్న తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు ముంబై సారథి రోహిత్ శర్మ మూడు మార్పులు చేశాడు. ధవళ్ కులకర్ణి, సౌరభ్ తివారి, పాటిన్సన్‌ స్థానాల్లో జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్‌ జట్టులోకి వచ్చారు.

రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్‌ దక్కించుకునేందుకు ముంబై బరిలోకి దిగుతుంటే.. లీగ్‌ దశలో రెండుసార్లు తమను ఓడించిన జట్టుపై ప్రతీకారం తీర్చుకుని ఐపీఎల్‌లో తొలిసారి ఫైనల్‌ చేరాలని ఢిల్లీ ఉత్సాహంతో ఉంది. క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టుకు ఫైనల్‌ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌ విజేతతో జరిగే క్వాలిఫయర్‌-2లో గెలిస్తే తుది పోరుకు చేరవచ్చు. ఆరంభం నుంచి తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ముంబై ఈ పోరులో ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది.

ఈ సీజన్‌లో ఇరు జట్లు తలపడిన రెండు మ్యాచ్‌లలోనూ ముంబై జట్టే విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ 162 పరుగులు చేయగా.. ముంబై 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. గత శనివారం జరిగిన తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ పేలవంగా ఆడి 110 పరుగులు చేయగా, ముంబై 14.2 ఓవర్లలోనే గెలిచింది. ఓవరాల్‌గా 24 సార్లు తలపడగా 14-12తో ముంబై లీడ్‌లో ఉంది. గత సీజన్‌లో మాత్రం చెరొక మ్యాచ్ గెలిచాయి.

తుది జట్లు:
ఢిల్లీ: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్య రహానే, రిషబ్ పంత్, మార్కస్ స్టొయినిస్, డేనియల్ స్యామ్స్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కాగిసో రబడ, అన్రిచ్ నోర్జే.

ముంబై: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, కీరన్ పొలార్డ్, నాథన్ కౌల్టర్-నైల్, రాహుల్‌ చహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌.

Story first published: Thursday, November 5, 2020, 19:17 [IST]
Other articles published on Nov 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+