IPL 2020 ప్లేఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్ ఇదే!!

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ప్లేఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆదివారం వెల్లడించింది. ఇంతకుముందు విడుదల చేసిన షెడ్యూల్‌లో కేవలం లీగ్ దశలో మ్యాచ్‌లనే వెల్లడించగా.. తాజాగా ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికల్ని ఖరారు చేసింది. నవంబర్ 5 నుండి 10 వరకు దుబాయ్ మరియు అబుదాబిలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు ఐపీఎల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ ఉంచింది.

నవంబర్ 5న క్వాలిఫయర్-1:
నవంబర్ 3వ తేదీతో ఐపీఎల్ లీగ్ దశలోని మ్యాచ్‌లు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం వెల్లడించింది. నవంబర్ 4వ తేదీన విశ్రాంతి దినం. నవంబర్ 5న క్వాలిఫయర్-1 మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ వేదికగా ఈ క్వాలిఫయర్ మ్యాచ్ జరుగనుంది. ఎప్పటిలానే లీగ్ దశలోని పాయింట్ల పట్టికలో టాప్-1, టాప్-2లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరుగనుంది. గెలిచిన జట్టు ఫైనల్ ఆడుతుంది.

6న ఎలిమినేటర్ మ్యాచ్:
నవంబర్ 6వ తేదీన ఎలిమినేటర్ మ్యాచ్ అబుదాబిలో జరుగనుంది. పాయింట్ల పట్టికలో టాప్-3, టాప్-4లో నిలిచిన జట్ల మధ్య ఈ ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 7న విశ్రాంతి దినం. ఇక నవంబర్ 8వ తేదీన అబుదాబి వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగనుంది. ఈ క్వాలిఫయర్-2లో మ్యాచ్‌లో.. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ వెళుతుంది.

నవంబర్ 10న ఫైనల్:
నవంబర్ 9వ తేదీన విశ్రాంతి దినం. ఇక ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా నవంబర్ 10న జరుగనుంది. క్వాలిఫయర్-1లో విజేత, క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు మధ్య ఫైనల్ జరుగుతుంది. దీంతో ఐపీఎల్ 2020 ముగుస్తుంది. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు అన్ని రాత్రి గం. 7.30ని.లకు ప్రారంభమవుతాయి. మహిళల టీ20 చాలెంజ్‌కు షార్జాను వేదికగా ఖరారు చేయడంతో.. ఇక్కడ ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు నిర్వహించడం లేదు. ఈ లీగ్ నవంబర్ 4 నుండి 9వరకు జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications