
బెర్త్‌లు 73.. బరిలో 332:
తొలిదశలో 971 మంది జాబితాను 332 మందికి కుదించింది. వేలానికి ఎంపికైన వారిలో 24 మంది కొత్తవారే ఉన్నారని సమాచారం తెలిసింది. అందులో 19 మంది టీమిండియాకు ఆడారు. ఇక ఫ్రాంచైజీల కోరిన క్రికెటర్లు కూడా ఇందులో ఉన్నారట. వారిలో విండీస్ పేసర్ విలియమ్స్, ఆల్‌రౌండర్ క్రిస్టియన్, ఆడమ్ జంపా, ముష్ఫికర్ రహీమ్, సర్రే యువ బ్యాట్స్‌మన్ విల్ జాక్స్ ఉన్నారు. అయితే రహీమ్ వేలం నుంచి తప్పుకున్నాడట.

విల్ జాక్స్‌పై భారీ అంచనాలు:
డిసెంబర్ 19న ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభం అవుతుంది. మొత్తం 73 బెర్త్‌లకు వేలం జరుగుతుంది. స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్, ఇయాన్ మోర్గాన్, పాట్ కమిన్స్, క్రిస్ మోరిస్ వేలంలో భారీ ధర పలుకుతారని తెలుస్తోంది. ఇక రాబిన్ ఉతప్ప, క్రిస్‌లిన్, ఆరోన్ ఫించ్, జేసన్ రాయ్‌కు కూడా మంచి డిమాండ్ ఉండనుంది. 25 బంతుల్లోనే సెంచరీ చేసిన విల్ జాక్స్‌ను కొనేందుకు అందరూ పోటీ పడుతున్నారు. ఆల్‌రౌండర్లపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నారు.

స్టార్క్, రూట్ దూరం:
స్టార్ ఆటగాళ్లు కొందరు లీగ్‌కు దూరంగా ఉన్నారు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ వేలానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ స్టార్క్ విరామం తీసుకోవడం గమనార్హం. గత సీజన్‌కు కూడా స్టార్క్ దూరంగానే ఉన్నాడు. రూట్ ఇప్పటివరకు టీ20 ఫార్మాట్లో అంతగా మెరుపులు మెరిపించలేదు.

2 కోట్ల ధరతో ఏడుగురు ఆటగాళ్లు:
వేలంలో ముందుగా బ్యాట్స్‌మెన్‌ను ఫ్రాంచైజీలు ఎంచుకుంటారు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు, కీపర్లు, పేసర్లు, స్పిన్నర్ల వంతు. 2020 జాబితాలో అత్యధిక ప్రాథమిక ధర కలిగిన ఏడుగురు ఆటగాళ్లు ఉన్నారు. మ్యాక్స్‌వెల్, కమిన్స్, హాజల్‌వుడ్, మార్ష్, స్టెయిన్, మాథ్యూస్, మోరిస్‌ల ప్రాథమిక ధర రూ. 2 కోట్లు. ఇక ఉతప్ప ప్రాథమిక ధర రూ. కోటిన్నర.


Click it and Unblock the Notifications












