Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: టైటిల్ స్పాన్సర్ రేసు నుండి ప‌తంజ‌లి ఔట్?

IPL 2020: Patanjali out of the IPL title sponsorship for the upcoming season

ముంబై: దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా చైనాకి చెందిన మొబైల్ కంపెనీ 'వివో'ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్ఫాన్సర్‌షిప్ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తప్పించిన విషయం తెలిసిందే. వివో స్థానంలో స్ఫాన్సర్‌షిప్ కోసం ఇప్పుడు భారత దేశానికి చెందిన పలు ప్రముఖ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఆయా కంపెనీలు బిడ్ దాఖలు చేశాయి. ఈ రేసులో టాటా సన్స్, అమెజాన్, బైజూస్, జియో పోటీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

యోగాగురు బాబా రాందేవ్‌కి చెందిన 'ప‌తంజ‌లి' కూడా ఐపీఎల్ 2020 టైటిల్ స్ఫాన్సర్‌షిప్‌ వేటలో ఉన్నట్లు మొన్నటివరకు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. టైటిల్ స్పాన్సర్ రేసు నుండి ప‌తంజ‌లి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రేసు నుండి ప‌తంజ‌లి తప్పుకోవడంతో.. టాటా సన్స్‌కే బిడ్ దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప‌తంజ‌లి ఎందుకుతప్పుకుందో సరైన కారణం తెలియరాలేదు. ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ ఎవరో బీసీసీఐ మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది.

ప‌తంజ‌లి బ్రాండ్‌కు గ్లోబ‌ల్ మార్కెటింగ్ ఫ్లాట్‌ఫాం ఇవ్వాల‌నుకుంటున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌తినిధి ఎస్‌కే తిజ‌రావాలా ఇదివరకు మీడియాకు తెలిపారు. ప‌తంజ‌లిని గ్లోబల్ మార్కెట్‌లో ఉంచేందుకు ఐపీఎల్ 2020 సరైన వేదిక అని అతను అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మాత్రం టైటిల్ స్పాన్సర్ రేసు నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.

ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌షిప్ కోసం బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న వివో.. టైటిల్ స్ఫాన్సర్‌గా ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది కూడా వివోనే టైటిల్ స్ఫాన్సర్‌గా కొనసాగుతుందని.. మూడు వారాల క్రితం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. కానీ సరిహద్దు వివాదం కారణంగా బీసీసీఐ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. 'బాయ్‌కాట్ ఐపీఎల్'‌ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. దాంతో వెనక్కి తగ్గిన బీసీసీఐ.. వివోతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.

Story first published: Monday, August 17, 2020, 16:58 [IST]
Other articles published on Aug 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+