Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: ఐపీఎల్ స్ఫాన్సర్‌షిప్ వేట‌లో ప‌తంజ‌లి!!

IPL 2020: Baba Ramdevs Patanjali Considers Bidding for IPL Title Sponsorship
IPL 2020 : Jio or Patanjali As Title Sponsor? Fans Celebrate VIVO's Exit || Oneindia Telugu

ముంబై: చైనాకి చెందిన మొబైల్ కంపెనీ 'వివో'ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్ఫాన్సర్‌షిప్ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల తప్పించిన విషయం తెలిసిందే. వివో స్థానంలో స్ఫాన్సర్‌షిప్ కోసం ఇప్పుడు భారత దేశానికి చెందిన పలు ప్రముఖ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఈ రేసులో అమెజాన్, బైజూస్, జియో పోటీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టాటా గ్రూప్‌, డ్రీమ్ 11, కోకాకోలా కూడా రేసులో ఉన్నట్టు వినికిడి. తాజాగా యోగా గురు బాబ్ రాందేవ్‌కి చెందిన 'ప‌తంజ‌లి' కూడా ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌షిప్‌ వేటలో ఉన్నట్లు తెలుస్తోంది.

 స్ఫాన్సర్‌షిప్ వేట‌లో ప‌తంజ‌లి:

స్ఫాన్సర్‌షిప్ వేట‌లో ప‌తంజ‌లి:

ప‌తంజ‌లి బ్రాండ్‌కు గ్లోబ‌ల్ మార్కెటింగ్ ఫ్లాట్‌ఫాం ఇవ్వాల‌నుకుంటున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌తినిధి ఎస్‌కే తిజ‌రావాలా తాజాగా తెలిపారు. ప‌తంజ‌లిని గ్లోబల్ మార్కెట్‌లో ఉంచేందుకు ఐపీఎల్ సరైన వేదిక అని అతను అభిప్రాయపడుతున్నారు.ఈ నేప‌థ్యంలో బీసీసీకి ప్ర‌తిపాద‌న చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. వివో స్థానంలో టైటిల్ స్ఫాన్సర్‌షిప్ కోసం బీసీసీఐ త్వరలోనే బిడ్స్‌ని ఆహ్వానించనుంది. పీఎల్ 2020కి ఎవ‌రు స్పాన్స‌ర్ అన్న‌ది ఇప్పుడో ప్ర‌శ్న‌. యూఏఈలో జ‌రిగే ఐపీఎల్‌కు స్పాన్స‌ర్ ఎవ‌రు వ‌స్తారో కచ్చితంగా చెప్ప‌లేం.

రేసులో బైజూస్, అమెజాన్‌:

రేసులో బైజూస్, అమెజాన్‌:

బైజూస్‌ సంస్థ ఇప్పటికే భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఆ భాగస్వామ్యం కారణంగా బైజూస్‌కు మొదటి ప్రాధాన్యత దక్కవచ్చని సమాచారం. టీమిండియాలాగే బీసీసీఐకి చెందిన మెగా ఈవెంట్‌తో కూడా జతకట్టాలని ఆ కంపెనీ కోరుకుంటోంది. అయితే బైజూస్‌కు ప్రధానంగా భారతీయ కంపెనీ 'జియో' నుంచి పోటీ ఎదురవుతోంది. ప్రస్తుతం అన్ని విధాలా దూసుకుపోతున్న జియోకు స్పాన్సర్‌షిప్‌ మొత్తం ఏ మాత్రం సమస్య కాకపోవచ్చు. క్రికెట్‌తో ఇప్పటి వరకు ఎక్కడా జతకట్టని మరో ప్రముఖ సంస్థ 'అమెజాన్‌' కూడా రేసులో ముందుంది.

ఏటా రూ. 440 కోట్లు:

ఏటా రూ. 440 కోట్లు:

ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌షిప్ కోసం బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న వివో.. టైటిల్ స్ఫాన్సర్‌గా ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది కూడా వివోనే టైటిల్ స్ఫాన్సర్‌గా కొనసాగుతుందని.. రెండు వారాల క్రితం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. కానీ సరిహద్దు వివాదం కారణంగా బీసీసీఐ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. 'బాయ్‌కాట్ ఐపీఎల్'‌ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. దాంతో వెనక్కి తగ్గిన బీసీసీఐ.. వివోతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.

 సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్:

సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్:

వివో తరహాలో ఐపీఎల్ 2020 సీజన్‌కి రూ.440 కోట్లు స్ఫాన్సర్ చెల్లించే అవకాశాలు ఇప్పుడు కనిపించడం లేదు. ఎందుకంటే.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖాళీ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగడమే. తాజా సమాచారం ప్రకారం రూ. 250-300 కోట్లు స్పాన్సర్‌షిప్‌గా లభిస్తే చాలని బీసీసీఐ కోరుకుంటోంది. ఏదేమైనా స్ఫాన్సర్‌షిప్‌కి మాత్రం ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంది. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.

'పాక్‌తో మ్యాచే.. చివరి టెస్టు అవుతుందేమోనని భయపడ్డా'

Story first published: Monday, August 10, 2020, 15:14 [IST]
Other articles published on Aug 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+