For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: ముంబై టు కోల్‌కతా, సిద్దార్ధ్ లాడ్‌కు మంచి ఆఫర్

IPL 2020: Mumbai Indians Siddesh Lad transferred to Kolkata Knight Riders

హైదరాబాద్: ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు సిద్ధార్ధ్ లాడ్ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడనున్నాడు. ఈ మేరకు ట్రేడింగ్‌లో అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం సొంతం చేసుకుంది. 2015 నుంచి సిద్ధార్ధ్ లాడ్ ముంబై ఇండియన్స్ జట్టులో భాగస్వామిగా ఉన్నాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో సిద్ధార్ధ్ లాడ్ గత సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో సిద్ధార్ధ్ లాడ్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ బాదాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం 13 బంతులాడిన లాడ్ 15 పరుగులు చేశాడు.

ఆటగాళ్ల బదిలీలకు నవంబర్ 14ని చివరి గడువు తేదీగా ప్రకటించడంతో ఫ్రాంచైజీలు విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకున్నాయి. ఇందులో భాగంగా పలువురి ఆటగాళ్లను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకోగా, మరికొందరిని వేలానికి విడుదల చేశాయి. ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకున్న ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిస్తే....

1. మయాంక్ మార్కండే (ముంబై to ఢిల్లీ) - Rs 20 lakh.
2. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (ఢిల్లీ to ముంబై) - Rs 6.2 crore.
3. జే సుజిత్ (ఢిల్లీ to పంజాబ్) - Rs 20 lakh
4. ట్రెంట్ బౌల్ట్ (ఢిల్లీ to ముంబై) - Rs 2.2 crore
5. కృష్ణప్ప గౌతమ్ (రాజస్థాన్ to పంజాబ్) - Rs 6.2 crore
6. అంకిత్ రాజ్‌పుత్ (పంజాబ్ to రాజస్థాన్) - Rs 3 crore
7. ధావల్ కులకర్ణి (రాజస్థాన్ to ముంబై) - Rs 75 lakh
8. రాహుల్ తెవాటియా (ఢిల్లీ to రాజస్థాన్) - Rs 3 crore
9. రవిచంద్రన్ అశ్విన్ (పంజాబ్ to ఢిల్లీ) - Rs 7.1 crore
10. అజ్యింకే రహానే (రాజస్థాన్ to ఢిల్లీ) - Rs 4 crore.

Story first published: Friday, November 15, 2019, 15:28 [IST]
Other articles published on Nov 15, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+