కేఎల్ రాహుల్ బ్యాడ్ కేప్టెన్సీ: చివరి ఓవర్‌లో స్పిన్నరా?: అందుకే: ఆరు ఓవర్లలో ఏకంగా సెంచరీ

అబుధాబి: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ సత్తా అప్పుడే ఆవిరైపోయిందా? ఆ జట్టు సామర్థ్యం, శక్తియుక్తులన్నీ ఒక్క మ్యాచ్‌కే పరిమితం అయ్యాయా? పంజాబ్ కేప్టెన్ కేఎల్ రాహుల్ వ్యూహాత్మక తప్పిదాలే కొంపముంచాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. అబుధాబిలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన వ్యూహాలు బెడిసి కొట్టాయనే అభిప్రాయాలు నెటిజన్లలో వ్యక్తమౌతున్నాయి. ముంబై ఇండియన్స్ వంటి బలమైన జట్టుపై విజయం సాధించడానికి పక్కాగా ప్లాన్ చేయడం.. దాన్ని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుందని, ఈ రెండు మిస్ అయ్యాయని అంటున్నారు.

భారీ స్కోరుకు కారణం అదే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన 13వ ఎడిషన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. ఏ స్థాయిలో చెలరేగిపోయి ఆడిందోో తెలుసు. చివరి ఆరు ఓవర్లలో ఏకంగా 104 పరుగులను పిండేశారు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్లు. డెత్ ఓవర్లలో కేఎల్ రాహుల్ చేసిన బౌలింగ్ ప్రయోగం దారుణంగా విఫలమైందనడానికి ఇదే నిదర్శనం. పేలవమైన బౌలింగ్ ఫలితంగానే ముంబై బ్యాట్స్‌మెన్లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. పంజాబ్ టీమ్‌కు భారీ స్కోరును నిర్దేశించారు.

చివరి ఓవర్‌లో స్పిన్నర్..
డెత్ ఓవర్లు ఏ టీమ్‌కైనా అత్యంత కీలకం. చివరి ఓవర్లలో వికెట్లు పడినప్పటికీ.. పెద్దగా పట్టించుకోరు గానీ.. భారీగా పరుగులను సాధించాలని మాత్రం ఏ జట్టయినా కోరుకుంటుంది. ఒక్క పరుగు చేసినా.. అది జట్టు విజయానికి దోహదం చేసేదిగానే భావిస్తారు బ్యాట్స్‌మెన్లు. అందుకే చివరి ఓవర్లలో ప్రధాన బౌలర్లను అట్టి పెట్టుకుంటారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆ పని చేయలేదు. చివరి ఓవర్‌లో స్పిన్నర్‌ను దింపడం కేఎల్ రాహుల్ బ్యాడ్ కేప్టెన్సీకి అద్దం పట్టిందని అంటున్నారు నెటిజన్లు.

అనుభవం లేని బౌలర్‌ను ఆడేసుకున్న పొలార్డ్..
అసలే డెత్ ఓవర్లు.. పైగా కీరన్ పొలార్డ్ వంట హార్డ్ హిట్టర్, అతనికి అండగా మరో పించ్ హిట్టర్ హార్దిక్ పాండ్యా క్రీజ్‌లో ఉన్న సమయంలో పెద్దగా అనుభవం లేని స్పిన్నర్ చేతికి చివరి ఓవర్ అప్పగించడం పట్ల విమర్శలు వ్యక్తమౌతున్నాయి. చివరి ఓవర్‌ను వేసిన కృష్ణప్ప గౌతమ్‌కు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేదు. పైగా అతని ఎదురుగా క్రీజ్‌లో ఉన్నది హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ వంటి హార్డ్ హిట్టర్లు. అలాంటి సమయంలో కృష్ణప్ప గౌతమ్‌ను బౌలింగ్ దింపాలనే ప్రయోగం దారుణంగా బెడిసికొట్టింది. చివరి ఓవర్ చివరి మూడు బంతులను పొలార్డ్ మూడు సిక్సులుగా మలిచాడు. మొత్తం 25 పరుగులను రాబట్టుకున్నారు.

ఆ ఒక్క ఓవర్‌లో కృష్ణప్ప బలి..
నిజానికి గురువారం రాత్రి నాటి మ్యాచ్‌లో కృష్ణప్ప గౌతమ్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో అతను ఇచ్చిన పరుగులు 20 మాత్రమే. 14వ ఓవర్‌ను వేసిన అతను నాలుగు పరుగులు మత్రమే ఇచ్చాడు. అదే ఓవర్‌లో ఇషాన్ కిషన్‌నూ అవుట్ చేశాడు. పొదుపుగా బౌలింగ్ చేస్తాడనే నమ్మకంతోనే కేఎల్ రాహుల్.. అతనికి 20వ ఓవర్‌ను అప్పగించి ఉండొచ్చు. ఇందులో సందేహాలు అక్కర్లేదు. అది 20వ ఓవర్ కావడమే శాపంగా మారింది. భారీ షాట్లకు పెట్టింది పేరైన పొలార్డ్.. తనవంతు పని కానిచ్చేశాడు. చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లను బాది అవతల పారేశాడు.

పంజాబ్ ఓటమికి అక్కడే బీజం..
నిజానికి పంజాబ్ బౌలర్లు పొదుపుగానే బౌలింగ్ చేశారు. 14వ ఓవర్ ముగిసే సరికి ముంబై ఇండియన్స్ జట్టు స్కోరు మూడు వికెట్లుకు 87 పరుగులు మాత్రమే. ఆ తరువాతే గేరు మార్చారు బ్యాట్స్‌మెన్లు. విజృంభించేశారు. చివరి ఆరు ఓవర్లలో ఏకంగా 104 పరుగులను పిండుకున్నారు. 15వ ఓవర్‌లో 15 పరుగులు, 16వ ఓవర్‌లో 22 రన్లు, 17వ ఓవర్‌లో అయిదు, 18వ ఓవర్‌లో 18, 19వ ఓవర్‌లో 19 పరుగులు చేసిన ముంబై బ్యాట్స్‌మెన్లు.. చివరి ఓవర్‌లో 25 పరుగుల రాబట్టుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications