MI vs RCB: జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత.. తొలి, వందో వికెట్‌గా విరాట్ కోహ్లీ!!

అబుదాబి: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్ 2020లో ఎనిమిదో విజయంతో ప్లేఆఫ్స్‌ను సమీపించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చేసి పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌ను పటిష్టం చేసుకుంది. బంతితో జస్ప్రీత్ బుమ్రా (3/14).. బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 79 నాటౌట్‌; 10ఫోర్లు, 3సిక్స్‌లు) విజృంభణతో సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే స్పీడ్‌స్టర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఐపీఎల్‌లో అరుదైన ఘనత అందుకున్నాడు.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌ ద్వారా జస్ప్రీత్‌ బుమ్రా ఐపీఎల్‌లో 100 వికెట్ల మార్కును పూర్తి చేసుకున్నాడు. ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీని ఔట్‌ చేసి ఈ మైలురాయిని చేరాడు. యాదృచ్చికంగా ఐపీఎల్‌లో బుమ్రా తొలి వికెట్, 100వ వికెట్‌ కోహ్లీనే కావడం విశేషం. 2013 ఐపీఎల్‌ తన అరంగేట్ర మ్యాచ్‌లో తొలి వికెట్‌గా విరాట్‌ను ఔట్‌ చేసిన బుమ్రా.. ఏడేళ్ల తర్వాత వందో వికెట్‌ ఫీట్‌ను సైతం అతడిని ఔట్‌ చేయడం ద్వారానే చేరుకోవడం విశేషం.

ఏప్రిల్‌ 4, 2013న బెంగళూరు చినస్వామి మైదానంలో ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది‌. విరాట్‌ కోహ్లీ అప్పటికే మంచి బ్యాట్స్‌మన్‌. గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల యువ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను ముంబై ఇండియన్స్‌ బరిలోకి దింపింది. మొదటి ఓవర్‌ కోహ్లీకి వేశాడు. వరుసగా మూడు బౌండరీలు బాది బుమ్రాకు కోహ్లీ స్వాగతం పలికాడు. దీంతో బుమ్రా కొంచెం ఒత్తడికి లోనయి తర్వాతి బంతిని వైడ్‌ వేశాడు. దాన్ని షాట్ ఆడే క్రమంలో విరాట్ ఔటయ్యాడు. ఐపీఎల్‌లో బుమ్రాకు ఇదే తొలి వికెట్‌. ఏడేళ్ల తర్వాత వందో వికెట్‌గా కోహ్లీని బుమ్రా ఔట్‌ చేశాడు.

ఐపీఎల్‌ 2020లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన జస్ప్రీత్‌ బుమ్రా 20 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్‌లో 8వ ఐపీఎల్‌ ఆడుతున్న బుమ్రా 20 వికెట్ల ఫీట్‌ సాధించడం ఇది రెండోసారి. మొత్తం 89 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన బుమ్రా ఇప్పటివరకు 102 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ప్రస్తుతం 15వ స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌ పేసర్ లసిత్‌ మలింగ అగ్రస్థానంలో ఉన్నాడు. టీ20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి భారత పేస్‌ బౌలర్‌గా, ఓవరాల్‌గా ఆరో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.

SRH vs DC: ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్ బాల్స్.. టాప్‌లో సన్‌రైజర్స్ బౌలర్!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, October 29, 2020, 14:29 [IST]
Other articles published on Oct 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X