IPL 2020: 21 ఏళ్ల యువ క్రికెటర్ కోసం ముంబై, చెన్నై పోటీ: ఎవరీ టామ్ బాంటన్?

హైదరాబాద్: టామ్ బాంటన్... అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరు ఇంకా పాపులర్ కాలేదు. కానీ, త్వరలో తప్పక అవుతుంది. ఎందుకంటే డిసెంబర్ 19న జరిగే ఐపీఎల్ వేలంలో ఇతగాడి పేరు కూడా ఉంది. ఇప్పటికే ఈ యువ క్రికెటర్ గురించి ఐపీఎల్‌లో టాప్ ప్రాంఛైజీలైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆరా తీయడం విశేషం.
ముంబై, సీఎస్‌కే ఫ్రాంచైజీలను ఆకర్షించాడంటే? అతడిలో ఉన్న ప్రత్యేకతలేంటి? టామ్ బాంటన్ బ్యాటింగ్ శైలి ఎలా ఉంటుంది. 21 ఏళ్ల టామ్ బాంటన్ ఇన్నవేటివ్ ప్లేయర్. అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త కొత్త షాట్లను కనిపెట్టడంలో దిట్ట. ఇప్పటికే హాకీ స్టైల్ స్వీప్స్, ఫ్లిక్స్ మరియు స్కూప్స్ వంటి అసాధారణ షాట్లను కనిపెట్టాడు.

టీ10 లీగ్‌లో కలందర్స్ జట్టుకు
అబుదాబి వేదికగా జరిగిన టీ10 లీగ్‌లో కలందర్స్ జట్టు తరుపున ఆడిన టామ్ బాంటన్ 28 బంతుల్లో 80 పరుగులతో చెలరేగాడు. అయితే, ఇలాంటి సూపర్ ప్రదర్శన టామ్ బాంటన్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది వైటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో బాంటన్ 42.23 యావరేజితో 549 పరుగులు చేశాడు.

ముంబై ఇండియన్స్‌కు ఆడాలని
స్ట్రయిక్ రేట్ 161.43గా ఉండటం విశేషం. కాగా, వ్యక్తిగతంగా టామ్ బాంటన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడాలని ఉందని చెప్పాడు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో బాంటన్ మాట్లాడుతూ "ఐపీఎల్‌లో ఆడాలని చిన్న వయస్సు నుండే నా కల. ఐపీఎల్ మ్యాచ్‌లకు పెద్దఎత్తున అభిమానులు హాజరవుతారు" అని తెలిపాడు.

వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ వేలంలో
"నేను ఈ ఏడాది (డిసెంబర్ 19)న జరిగే ఐపీఎల్ వేలంలో ఉన్నాను. ఎవరో ఒకరు ఎంపిక చేసుకుంటారని అనుకుంటున్నా. చిన్నప్పటి నుంచి ముంబై ఇండియన్స్ జట్టు ఆట చూడటం ఇష్టం. ఇంగ్లాండ్ అండర్ -19 జట్టులో భాగంగా నేను వాంఖడేలో మ్యాచ్ ఆడాను. మేము 5-0 తేడాతో ఓడిపోయినప్పటికీ, మైదానంలో అద్భుతమైన మద్దతు లభించింది" అని చెప్పుకొచ్చాడు.

ఈ ఏడాది అద్భుతం
"2019 నాకొక అద్భుతమైన ఏడాది అవుతుందని అనుకోలేదు. నేను ఫామ్‌లో ఉన్నప్పుడు ఎవరూ ఆపలేరు" అని ఇంగ్లాండ్ యువ క్రికెటర్ టామ్ బాంటన్ వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications