'ధోనీ'నా మజాకా.. ప్రాక్టీస్‌కే స్టేడియం దద్దరిల్లింది (వీడియో)!!

చెన్నై: ఈనెల 29న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13 మొదలవనుండగా.. చెన్నై క్రికెట్ అభిమానులను అప్పుడే ఐపీఎల్ ఫీవర్ పట్టుకుంది. అందుకు కారణం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టడమే. ఈ సీజన్ ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టాడు. సోమవారం ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి ప్రాక్టీస్ సెషన్‌లో మహీ పాల్గొన్నాడు.

దద్దరిల్లిన మైదానం:
సోమవారం రాత్రి ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్ సాధన మొదలుపెట్టాడు. నెట్స్‌లో కాసేపు బ్యాటింగ్ చేశాడు. హిట్టింగ్‌తో ఫ్యాన్స్‌ను ధోనీ అలరించాడు. చాలా కాలం తర్వాత మహీ సన్నాహకానికి దిగడంతో.. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. అతడు బ్యాటు పట్టి అడుగుపెట్టే సమయంలో చిదంబరం స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. అభిమానులు 'ధోనీ..ధోనీ.. ధోనీ.. ధోనీ' అంటూ నినాదాలు చేశారు.

'ధోనీ'నా మజాకా:
ధోనీ సాధనకు సంబంధించిన వీడియోను చెన్నె సూపర్ కింగ్స్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఎందరో మహీ అభిమానులు వీడియోను చూసారు. లక్షల్లో కామెంట్లు వచ్చాయి. ఇక మహీ ఫాన్స్ తమదైన స్టయిల్లో కామెంట్లు చేస్తున్నారు. 'ధోనీ'నా మజాకా అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'మహీ బ్యాట్ పట్టడం చాలా సంతోషంగా ఉంది' అని మరో అభిమాని కామెంట్ చేసాడు.

ఆటగాళ్లు ఎప్పుడు సాధన చేస్తున్నా:
ధోనీతో పాటు సురేష్ రైనా, అంబటి రాయుడు, మురళీ విజయ్, పీయూష్ చావ్లా, కరణ్ శర్మ మరికొందరు ప్లేయర్లు ప్రాక్టీస్ చేశారు. రాయుడు బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసాడు. విజయ్ భారీ షాట్లు ఆడుతూ కనిపించగా.. చావ్లా సహచరులకు బౌలింగ్ వేసాడు. చెన్నై కోచ్‌లు ప్రాక్టీస్ సమయంలో మైదానంలో ఉండి ఆటగాళ్లకు సూచనలు చేసారు. రెండేళ్లుగా చిదంబరం మైదానంలో ఆటగాళ్లు ఎప్పుడు సాధన చేస్తున్నా.. అక్కడి స్థానిక అభిమానులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు.

అభిమానుల నుంచి ఘన స్వాగతం:
ఐపీఎల్ మొదలవుతున్న నేపథ్యంలో చెన్నై కెప్టెన్ హోదాలో మహీ సోమవారం ఇక్కడికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో అభిమానుల నుంచి ఘన స్వాగతం అందుకున్న ధోనీ.. ఆ తర్వాత జట్టు సహచరులతో కలిసి కాసేపు మాట్లాడాడు. ఆపై ప్రాక్టీస్ చేసాడు. మహీ ఈసారి ఐపీఎల్‌కు కొత్త హెయిర్‌స్టయిల్‌తో దర్శనమిస్తున్నాడు.

తొలి మ్యాచ్‌లో ముంబైతో చెన్నై ఢీ:
ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో ఓటమి పాలైన తర్వాత ఎంఎస్ ధోనీ మైదానంలో అడుగుపెట్టని విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం ఝార్ఖండ్ జట్టుతో కలిసి ఓ వారం సాధన చేసాడు. మార్చి 29 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications