CSK: రోహిత్ శర్మ 95 మీటర్ల భారీ సిక్స్.. అంతకుమించి బాదిన ఎంఎస్ ధోనీ (వీడియో)

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం యూఏఈకి వెళ్లిన అన్ని జట్లు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక ఐపీఎల్ 13వ సీజన్‌కు ఇంకా వారం రోజులే ఉండడంతో జట్లన్నీ ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. సెప్టెంబర్ 19న అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య లీగ్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆటగాళ్లు కరోనా బారిన పడిన కారణంగా ఆలస్యంగా ప్రాక్టీస్ మొదలెట్టిన చెన్నై ఆటగాళ్లు నైట్ సెషన్‌లో కూడా కష్టపడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ ఎంఎస్ ధోనీ. మైదానంలో భారీ భారీ సిక్సులతో విడుచుకుపడుతున్నాడు.
బాల్ పోయింది
ఎంఎస్ ధోనీ గత నెల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గత ఏడాది కాలంగా మహీ క్రికెట్ ఆడని విషయం తెలిసిందే. అయితే మధ్యలో జార్ఖండ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లతో కొన్ని రోజులు మాత్రమే సాధన చేశాడు. ఇక ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లినా.. లేటుగానే ప్రాక్టీస్ చేస్తున్నాడు. సాధన సందర్భంగా ధోనీ కొట్టిన ఓ భారీ సిక్స్ ఏకంగా స్టేడియం బయటే పడింది. చెట్ల మీదుగా వెళ్లి అల్లంత దూరాన పడింది. వీడియో తీసిన చెన్నై టీమ్ మేనేజర్ రసెల్ రాధాకృష్ణ 'బాల్ లాస్ట్' (బాల్ పోయింది) అని పేర్కొన్నాడు.

అంతకుమించిన సిక్సర్:
ఎంఎస్ ధోనీ కొట్టిన భారీ సిక్స్ చూసి మైదానంలో లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న చెన్నై ఓపెనర్ మురళీ విజయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎంఎస్ ధోనీ టైమింగ్, బ్యాట్ స్పీడ్, స్వింగ్ కారణంగానే ఆ భారీ షాట్ సాధ్యమైందని ఆ వీడియోలో విజయ్ అన్నాడు. భారత్‌తో పోలిస్తే యూఏఈలో మైదానాలు చాలా పెద్దగా ఉంటాయి. ఇక ఇటీవల జరిగిన సాధన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ భారీ సిక్స్ బాదేశాడు. 95 మీటర్ల దూరం వెళ్లిన ఆ సిక్స్.. స్టేడియం వెలుపల రోడ్డుపై వెళ్తున్న బస్సుపై పడింది. అయితే మహీ కొట్టిన సిక్స్ అంతకుమించి వెళ్లింది.

అభిమానుల ఆనందం:
ఎంఎస్ ధోనీ కొట్టిన భారీ సిక్సుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ఏడాది క్రికెట్ ఆటకు దూరంగా ఉన్నా.. మహీ ఆటలో ఏమాత్రం పస తగ్గలేదు అని అభిమానులు అంటున్నారు. 'తలా ధోనీ అంటే ఏమనుకుంటున్నారు' అని వీడియోపై ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'ధోనీనా.. మజాకా' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

టోర్నీ ఆరంభానికి ముందే షాక్‌లు:
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా ముంబై, చెన్నై జట్లు నిలిచాయి. ముంబై నాలుగు టైటిల్స్ ఖాతాలో వేసుకోగా.. చెన్నై మూడు ట్రోఫీలను అందుకుంది. అయితే ఈసారి టోర్నీ ఆరంభానికి ముందే చెన్నైకి కొన్ని ఊహించని షాక్‌లు తగిలాయి. సీఎస్‌కే వైస్ కెప్టెన్ సురేశ్ రైనా, వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ జట్టును కరోనా పట్టుకుంది. వీటన్నింటిని అధిగమించి ఈసారి ఎలా ఆడుతుందో చూడాలి.
CSA: ఊహించని షాక్.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై నిషేధం!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications