For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ బ్యాట్‌ పట్టిన ధోనీ.. మైదానంలో సిక్సుల మోత!!

IPL 2020: MS Dhoni Begins Preparation for IPL in Ranchi

రాంచీ: గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కు దూరమైన భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ మళ్లీ బ్యాట్‌ పట్టాడు. వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020 మ్యాచులు మొదలవుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ధోనీ తన స్వస్థలమైన రాంచీలో నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. హెలికాప్టర్ షాట్లు త్వరలో చూస్తారని చెన్నై జట్టు స్టార్ ఆటగాడు సురేష్ రైనా చెప్పిన ఒక రోజు తర్వాత.. మహీ ప్రాక్టీస్ ఆరంభించడం విశేషం.

బౌలింగ్ మెషీన్లతో:

బౌలింగ్ మెషీన్లతో:

రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియం కాంప్లెక్స్‌లో ఐపీఎల్‌కు సిద్ధమయ్యే ప్రయత్నంలో ఎంఎస్ ధోనీ ఉన్నాడు. వైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం రాంచీలో ఎక్కువ మంది బౌలర్లు అందుబాటులో లేనందున.. మహీ ప్రస్తుతానికి బౌలింగ్ మెషీన్లను ఎదుర్కొంటున్నాడట. సాధన సమయంలో భారీ సిక్సులు కొట్టినట్టు తెలుస్తోంది. 'గత వారం జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియం కాంప్లెక్స్‌కు మహీ వచ్చాడు. ఇండోర్‌ స్టేడియంలో బౌలింగ్‌ మెషిన్‌ను ఉపయోగించి బ్యాటింగ్‌ సాధన చేశాడు' అని ఝార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫీస్‌ బేరర్‌ ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పారు.

 రెండు రోజులు బ్యాటింగ్ ప్రాక్టీస్:

రెండు రోజులు బ్యాటింగ్ ప్రాక్టీస్:

'ఎంఎస్ ధోనీ ప్రణాళికలు ఏమిటో, అతను ప్రాక్టీస్‌ కోసం మళ్లీ ఇక్కడికి వస్తాడో లేదో నాకు నిజంగా తెలియదు. సాధన కోసం ఇక్కడి రావడంతోనే ఆ విషయం మాకు తెలిసింది. గత వారాంతంలో రెండు రోజులు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసాడు కాని అప్పటి నుండి మరలా ఇక్కడికి రాలేదు. అయితే ప్రాక్టీస్ కోసం ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చాడు కావొచ్చు' అని సదరు అధికారి తెలిపారు. మహీ టీమిండియా తరఫున ఆడి ఏడాది కావొస్తున్న విషయం తెలిసిందే.

త్వరలో యూఏఈ పయనం:

త్వరలో యూఏఈ పయనం:

యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జట్టు ఆగస్టు 20న అక్కడికి పయనం కానున్నాయి. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత మార్చిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వహించిన శిక్షణా శిబిరంలో సాధన చేశాడు. ప్రాక్టీస్ సమయంలో భారీ సిక్సర్లు కూడా బాదాడు. మహీని చూడడానికి చిదంబరం మైదానంకు భారీ స్థాయిలో అభిమానులు క్యూ కట్టారు. అయితే వైరస్ వ్యవథి కారణంగా రాంచికి వెళ్ళిపోయాడు.

 మూడు ఐపీఎల్ టైటిల్స్:

మూడు ఐపీఎల్ టైటిల్స్:

ప్రపంచ క్రికెట్‌లో మూడు ఐసీసీ టైటిల్స్ నెగ్గిన ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోనీ. ఐసీసీ టీ20 ప్రపంచకప్, ఐసీసీ వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ టేందినియాకు అందించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు 90 టెస్టుల్లో, 350 వన్డేల్లో, 98 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 4876, వన్డేల్లో 10773, టీ20ల్లో 1617 రన్స్ చేశాడు. మరోవైపు చెన్నై జట్టు మూడు ఐపీఎల్ టైటిల్స్ అందించి.. లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారథిగా కొనసాగుతున్నాడు.

నా బాల్యంలో కపిల్‌దేవ్‌ గురించి కథలు కథలుగా చెప్పేవారు: ఇర్ఫాన్‌

Story first published: Friday, August 7, 2020, 11:56 [IST]
Other articles published on Aug 7, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+