IPL 2020 Finalకు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం.. తుదిపోరుకు డౌటే!!

దుబాయ్: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్ ఆరోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. 2019 సీజన్ తుది పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌ని చిత్తు చేసి కప్పు చేజిక్కించుకున్న రోహిత్ సేన.. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో 57 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో ఏడాది ఫైనల్ చేరింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' జస్ప్రీత్ బుమ్రా (4/14), ట్రెంట్ బౌల్ట్ (2/9) విజయంలో కీలక పాత్ర పోషించారు.

తొడ కండరాల గాయంతో
201 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ బరిలో దిగగా.. తొలి ఓవర్లోనే ఓపెనర్ పృథ్వీ షా (0), అజింక్య రహానే (0)లను ట్రెంట్ బౌల్ట్ ఔట్ చేశాడు. రెండో ఓవర్ బౌలింగ్‌కు దిగిన బుమ్రా.. అద్భుతమైన యార్కర్‌తో శిఖర్ ధావన్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు బోర్డుపై ఒక్క పరుగైనా చేరకుండానే మూడు వికెట్లు కోల్పోయింది. మంచి ఫామ్‌లో ఉన్న రహానేను బౌల్ట్ ఔట్ చేయడంతో ఢిల్లీ కోలుకోలేకపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన బౌల్ట్.. గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్‌కు దిగలేదు.

మూడు రోజుల సమయం
తొడ కండరాల గాయంతో ట్రెంట్ బౌల్ట్ మైదానాన్ని వీడగా.. ఆ తర్వాత బౌలింగ్ చేసేందుకు మళ్లీ రాలేదు. మ్యాచ్ జరుగుతుండగా.. బౌల్ట్ డ్రెసింగ్ రూంలో కనిపించాడు. మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'మైదానం వీడిన తర్వాత బౌల్ట్‌ను మళ్లీ చూడలేదు. అతడికైనా గాయం తీవ్రమైంది కాదనిపిస్తోంది. గాయం చిన్నదే కాబట్టి ఎలాంటి ఆందోళన లేదు. ఫైనల్ మ్యాచ్‌కు మూడు రోజుల సమయం ఉంది. ఈలోగా అతడు కోలుకుంటాడు' అని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే బౌల్ట్‌కు అయినా గాయంపై ఎలాంటి స్పష్టత లేదు.

ఫైనల్‌కు దూరమైతే
ఐపీఎల్ 2020 ఫైనల్‌కు దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్.. ఫైనల్లోనూ సత్తాచాటి ఐదోసారి టైటిల్ గెలవాలని చూస్తోంది. అయితే కీలక ఫైనల్ మ్యాచ్ సమయంలో స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ గాయపడటం రోహిత్ సేనను ఆందోళనకు గురి చేస్తోంది. బౌల్ట్ ఫైనల్ ఆడతాడని రోహిత్ చెబుతున్నా.. కివీస్ బౌలర్ మైదానం నుంచి వెళ్లాక చికిత్స తీసుకున్నాడు. ఒకవేళ బౌల్ట్ గాయం కారణంగా ఫైనల్‌కు దూరమైతే.. కచ్చితంగా ముంబై బౌలింగ్ విభాగంపై ప్రభావం పడుతుంది. అది జట్టు విజయావకాశాలపై కూడా ప్రభావం చూపనుంది.

రిస్క్ తీసుకునే అవకాశాలు లేవు
ఐపీఎల్ అనంతరం న్యూజిలాండ్ త్వరలోనే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ సమయంలో ట్రెంట్ బౌల్ట్ రిస్క్ తీసుకునే అవకాశాలు లేవని సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం అయిన గాయానికి కనీసం పది రోజుల విశ్రాంతి అవసరమని పలువురు సూచనలు చేస్తున్నారు. నిజంగానే బౌల్ట్ ఫైనల్ ఆడలేకపోతే.. జస్ప్రీత్ బుమ్రతో పాటు నాథన్ కౌల్టర్ నైల్, మెక్ క్లెగాన్‌లు ముంబై పేస్ భారాన్ని మోయాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications