ముంబై ఇండియన్స్‌కు కంగ్రాట్స్
మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌కు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్‌ఖలీఫా ఎల్‌ఈడీ లైట్లతో కంగ్రాట్స్ చెప్పింది. మంగళవారం రాత్రి బూర్జ్ ఖలీఫాపై ముంబై ఇండియన్స్ అనే అక్షరాలను ప్రదర్శించారు. బాణాసంచా వెలుగు మధ్య నీలి రంగులో ముంబై ఇండియన్స్ అనే ఆంగ్ల పదాలు బూర్జ్ ఖలీఫాపై మెరిసిపోయాయి.

బూర్జ్ ఖలీఫాపై తళుక్కుమన్న రోహిత్
విజయం అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చిత్రాన్ని కూడా బూర్జ్ ఖలీపాపై ప్రదర్శించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బూర్జ్ ఖలీఫాపై ఓ భారత క్రికెటర్ ఫొటో కనిపించడం ఇదే తొలిసారి. గతంలో మహాత్మా గాంధీ, షారుక్ ఖాన్‌ల ఫొటోలను బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ఇక ఈ సీజన్ ఆరంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ లోగో, ఆటగాళ్ల ఫొటోలను బూర్జ్ ఖలీపాపై ప్రదర్శించిన సంగతి తెలిసిందేే. ముంబై ఇండియన్స్ అక్షరాలను బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించిన ఫొటోను ముంబై తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

'గూగుల్' సర్‌ప్రైజ్
ఐపీఎల్ 2002లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ 'గూగుల్' సర్‌ప్రైజ్ ఇచ్చింది. గూగుల్‌లోకి వెళ్లి ముంబై జట్టు పేరుతో వెతికితే.. తారాజువ్వలు స్క్రీన్‌పై వెలిగేలా ఏర్పాటు చేసింది. కొన్ని సెకండ్ల పాటు అలా వెలుగుతాయి. ముంబై జట్టు వివరాలతో పాటు.. ఢిల్లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ స్కోరు బోర్డు కూడా స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి.

2011లో రూ.12కోట్లు
లీగ్ ప్రారంభ సంవత్సరం 2008లో దక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన రోహిత్ శర్మ.. అద్భుత ప్రతిభ కనబరిచాడు. వరుసగా మూడు సీజన్లలోనూ 350కిపైగా పరుగులు చేసి సత్తాచాటాడు. దీంతో 2011లో రూ.12కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను సొంతం చేసుకుంది. తొలి రెండేళ్లలో తీవ్ర నిరాశపరిచిన రోహిత్.. 2013 నుంచి వెనుదిరిగిచూసుకోలేదు. దిగ్గజం సచిన్ టెండూల్కర్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ముంబై జట్టును టైటిల్స్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఏడుసార్లు ఫైనల్
ఏడుసార్లు ఫైనల్ ఆడిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ. దక్కన్ ఛార్జర్స్ తరఫున ఒకసారి, ముంబై ఇండియన్స్ తరఫున ఆరుసార్లు ఫైనల్ ఆడాడు. రోహిత్ ఆరుసార్లు ఛాంపియన్ జట్టులో సభ్యుడు. ప్రపంచ క్రికెట్లో మరే ఆటగాడికి ఈ రికార్డు లేదు. రోహిత్ శర్మ తర్వాత అంబటి రాయుడు, కీరన్ పొలార్డ్, లసిత్ మలింగ ఉన్నారు. వాళ్లు నాలుగుసార్లు ఛాంపియన్ జట్టులో ఆటగాళ్లుగా ఉన్నారు. ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, హార్దిక్ పాండ్యా మూడు సార్లు ఛాంపియన్ జట్టులో సభ్యులుగా ఉన్నారు.
ఐపీఎల్ 2020లో దారుణంగా విఫలం.. మ్యాక్స్‌వెల్, కాట్రెల్‌లపై వేటు?


Click it and Unblock the Notifications
