MI vs DC: రహానే తత్తరపాటు.. బతికిపోయి బౌండరీలు బాదేసిన ఇషాన్ కిషన్!!

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. క్వింటన్ డికాక్ (53: 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (53: 32 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధ శతకాలతో రాణించడంతో 163 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండానే ఛేదించింది. ఈ మ్యాచులో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ ముంబై ఆటగాళ్లు అద్భుత విన్యాసాలు చేసి అదరహో అనిపిస్తే.. ఢిల్లీ ప్లేయర్స్ తేలిపోయారు.
రహానే తత్తరపాటు
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అజింక్య రహానే తత్తరపాటు కారణంగా ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన ఢిల్లీ పేసర్ కగిసో రబాడ బౌలింగ్‌లో షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా ఫుష్ చేసిన సూర్యకుమార్ యాదవ్ సింగిల్ కోసం ముందుకు వచ్చాడు. అక్కడే ఉన్న ఫీల్డర్ అజింక్య రహానే వేగంగా వచ్చి బంతిని అందుకునేలా కనిపించడంలో.. సూర్యకుమార్ మళ్లీ వెనక్కి తగ్గాడు. అయితే అప్పటికే వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చిన ఇషాన్ కిషన్ కీపర్ ఎండ్‌వైపు దాదాపు క్రీజు సమీపానికి వచ్చేశాడు. రహానే డైవ్ చేస్తూ బంతిని కీపర్ ఎండ్‌వైపు విసరగా.. అప్పటికే సూర్యకుమార్ క్రీజులోకి వచ్చేశాడు.

బౌండరీలు బాదాడు
మరో ఎండ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ వెనక్కి వచ్చేసి.. రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఒకవేళ అజింక్య రహానే బంతిని నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని బౌలర్‌కి విసిరి ఉంటే.. ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యేవాడు. అప్పటికి ఇషాన్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేదు. ఇలా రహానే తత్తరపాటు కారణంగా బతికిపోయిన ఇషాన్.. బౌండరీలు బాదాడు. 15 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్కులు బాది 28 రన్స్ చేశాడు. ఇలా లక్ష్య ఛేదనలో ఇషాన్ తనవంతు పాత్ర పోషించాడు.

ధావన్ కారణంగా
ముంబై ఫీల్డర్లు మాత్రం ఢిల్లీకి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. శిఖర్ ధావన్‌తో సమన్వయ లోపం కారణంగా ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో మార్కస్ స్టోయినిస్ రనౌటైపోయాడు. స్పిన్నర్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో బంతిని మిడాన్ దిశగా హిట్ చేసిన స్టోయినిస్ సింగిల్ పూర్తి చేసి.. రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఫీల్డర్ సూర్యకుమార్ చేతుల్లో నుంచి బంతి బౌన్స్ అయ్యింది. దాంతో రెండో పరుగు కోసం కీపర్ ఎండ్‌వైపు స్టోయినిస్ పరుగెత్తాడు. తొలుత రెస్పాండ్ అయిన ధావన్.. అనూహ్యంగా వెనక్కి తగ్గాడు. అప్పటికే పిచ్ సగంలోకి వెళ్లిపోయిన స్టోయినిస్.. రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇది ఢిల్లీ ఓటమికి ఓ కారణం అని చెప్పొచ్చు.

సమన్వయం లోపించడంతోనే
ఐపీఎల్ 2020 సీజన్‌లో రనౌట్‌లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రతి మ్యాచ్‌లో కనీసం ఒక రనౌట్ నమోదవుతుంది. ఈ రనౌట్‌లలో ఎక్కువగా ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపించడం కారణంగానే.. ప్లేయర్స్ వెనుదిరుగుతున్నారు. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనే ఇలా రెండు జరగడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
షాకింగ్ న్యూస్.. రషీద్ ఖాన్ సతీమణి అనుష్క శర్మనే అట!!