ఐపీఎల్ 2020: రూ. 2 కోట్ల క్లబ్‌లో ఉన్నది వీరే, భారత్ నుంచి ఒక్కడు లేడు!

హైదరాబాద్: ఐపీఎల్ 2020 కోసం డిసెంబర్ 19న వేలం జరగనుంది. కోల్‌కతాలో జరగనున్న ఈ వేలంలో ఇప్పటికే 971 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నవంబర్ 30తో ఐపీఎల్ ప్లేయర్ల నమోదు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. వచ్చే సీజన్ కోసం జరిగే వేలంలో 713 భారతీయులు, 258 విదేశీ ఆటగాళ్లు 73 స్పాట్‌ల కోసం పోటీపడనున్నారు.
ఇందులో 215 మంది క్యాప్‌డ్ ప్లేయర్లు, 754 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు, ఇద్దరు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు. ఈ 971 మంది నుంచి తాము ఎంపిక చేసుకోవలనుకుంటున్న ఆటగాళ్ల పేర్లను డిసెంబర్ 9వ తేదీలోపు ఫ్రాంఛైజీలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ జాబితాలో ఉన్న వారికే వేలంలో చోటు దక్కుతుంది.

గరిష్టంగా 73 మందిని మాత్రమే
వేలంలో గరిష్టంగా 73 మందిని మాత్రమే ఎంపికచేసుకునే అవకాశం ఫ్రాంఛైజీలకు ఉంది. అయితే, వేలంలో అత్యధిక బేస్ ప్రైజ్ కలిగిన ఆటగాళ్లను ఒక్కసారి పరిశీద్దాం. రూ. 2 కోట్ల క్లబ్‌లో ప్యాట్ కమ్మిన్స్, జోష్ హేజల్‌ఉడ్, క్రిస్ లిన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేల్ స్టెయిన్, ఏంజెలో మ్యాథ్యూస్‌లు ఉన్నారు.
రూ. 2 కోట్ల క్లబ్‌లో ఉన్న ఆటగాళ్లు వీరే
వీరందరి కనీస ధర రూ. 2 కోట్లు. వీరిని వేలంలో ప్రాంఛైజీలు సొంతం చేసుకోవాలంటే కనీస ధర లేదా అంతకుమించిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇక, రూ. 1.5 కోట్ల క్లబ్‌లో రాబిన్ ఊతప్ప, షాన్ మార్ష్, కేన్ రిచర్డ్‌సన్, ఇయాన్ మోర్గాన్, జేసన్ రాయ్, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, క్రిస్ మోరిస్, కైలీ అబ్బాట్ తదితరులు ఉన్నారు.

స్టార్ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్‌కు దూరం
ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. భారత్ నుంచి నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 19 మంది క్యాప్‌డ్ ప్లేయర్లు, 634 మంది అన్‌క్యాపడ్ ప్లేయర్లు, కనీసం ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడిన వారు 60 మంది, భారత్ తరుపున ఆడిన వారు 196 మంది, ఆడని వారు 60 మంది ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications