విదేశాల్లో ఐపీఎల్ 2020.. ఆతిథ్య రేసులో ఆ రెండు దేశాలు!!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఎడిషన్ విదేశాల్లో నిర్వహించడం ఖాయమే అని సమాచారం తెలుస్తోంది. యూఏఈ లేదా శ్రీలంకలలో ఐపీఎల్ 2020 జరిగే అవకాశముంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి భారత్‌లో ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోగా.. రోజురోజుకు వేలల్లో కేసుల సంక్య పెరుగుతుండంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ మేరకు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం తెలుస్తోంది.

యూఏఈ లేదా శ్రీలంక:
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌పై ఏదో ఒక నిర్ణయం వెలువడితే.. ఐపీఎల్ 2020ని విదేశాల్లో నిర్వహించనున్నట్లు ఐపీఎల్ పాలకవర్గం ప్రకటించనుందని బీసీసీఐలోని ఓ అధికారి అంటున్నారు. వీలైనంత వరకు భారత్‌లోనే లీగ్‌ను నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే ఒకవేళ వైరస్ నియంత్రణలోకి రాకపోతే.. యూఏఈ లేదా శ్రీలంకకు టోర్నీని తరలించక తప్పదని ఆ బీసీసీఐ అధికారి తెలిపారు. తాజాగా ముంబైలోనే టోర్నీ నిర్వహించనున్నారు అని కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

విదేశాల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి:
'మేమింకా ఐపీఎల్ 2020 వేదికను నిర్ణయించలేదు. విదేశాల్లో నిర్వహించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కువ జట్లు ఒకేసారి వచ్చి ఒకటి లేదా రెండు మైదానాల్లో ఆడే పరిస్థితి భారత్‌లో కనిపించడం లేదు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లో నిర్వహించినప్పటికీ సాధారణ ప్రజలతో పాటు ఆటగాళ్లకు సురక్షితమైన వాతావరణం కల్పించాలి. అదీ అభిమానులు లేకుండా. ఆటగాళ్ల భద్రత కూడా బీసీసీఐకి ముఖ్యం. దుబాయ్, శ్రీలంక ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నాయి. వైరస్ పరిస్థితి, లాజిస్టిక్స్ అవసరాలను బట్టి వేదికను నిర్ణయించాలి' అనిబీసీసీఐ అధికారి తెలిపారు.

వైరస్ నియంత్రణలోకి రాకపోతే:
ఈ ఏడాది ఐపీఎల్‌ను ఎలాగైనా నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న బీసీసీఐ అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నది. ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 మెగా టోర్నీ వాయిదాపడే సూచనలు కనిపిస్తుండగా.. ఆ విండోలో ఐపీఎల్ 2020ని నిర్వహించాలని ఇప్పటికే బీసీసీఐ నిర్ణయించింది. అయితే అప్పటిలోపు భారత్‌లో వైరస్ అదుపులోకి వస్తుందని ఆశించిన బీసీసీఐ.. దేశంలో క్రికెట్ సంఘాలకి కూడా ఐపీఎల్‌కి సిద్ధంగా ఉండాలంటూ లేఖలు రాసింది. కానీ పరిస్థితులు రోజు రోజుకి అధ్వానంగా మారుతుండటంతో భారత్‌లో టోర్నీని నిర్వహించడం అసాధ్యంగా మారింది. దీంతో విదేశాల్లో టోర్నీ నిర్వహించడంపై కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications