KXIP vs RR: చావో రేవో మ్యాచ్.. రాజస్థాన్‌పై పంజాబ్ ప్రతీకారం తీర్చుకునెనా? సిక్సర్ కొట్టెనా?

అబుదాబి: ఐపీఎల్‌‌‌‌ 2020 సీజన్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌‌‌‌కు రంగం సిద్ధమైంది. ఊహించని విధంగా వరుస ఐదు విజయాలు అందుకొని పంజా విసురుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ శుక్రవారం జరిగే చావో రేవో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

ప్లే ఆఫ్‌‌‌‌ రేస్‌‌‌‌ నేపథ్యంలో ఈ మ్యాచ్‌‌ ఫలితం‌‌‌ ఇరు జట్లకు కీలకం. మరీ ముఖ్యంగా రాజస్తాన్‌ రాయల్స్‌‌‌కు ఈ విజయం అత్యవసరం. ఓడిపోతే ప్లే ఆఫ్‌‌‌‌ పోటీ నుంచి ఔటవుతుంది. మరోపక్క రాయల్స్‌‌‌‌ను చిత్తు చేసి ప్లే ఆఫ్‌‌‌‌ బెర్త్‌‌‌‌కు మరింత దగ్గరవ్వాలని పంజాబ్‌‌‌‌ భావిస్తోంది. అయితే ఈ సీజన్ ఫస్టాఫ్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ అద్భుత విజయాన్నందుకుంది.

పంజాబ్ విధించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాహుల్ తెవాటియా సెన్సెషనల్ బ్యాటింగ్‌తో రాజస్థాన్ చేధించింది. ఆ మ్యాచ్‌లో ఆఖరి వరకు పోరాడిన పంజాబ్ విజయం ముంగిట చేతులెత్తేసింది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలతో పాటు గత మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో పంజాబ్ బరిలోకి దిగుతుంది. మరి విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి!

పటిష్టంగా పంజాబ్..

పటిష్టంగా పంజాబ్..

ఫామ్‌‌‌‌ ప్రకారం కింగ్స్ పంజాబే ఈ మ్యాచ్‌‌‌‌లో ఫేవరెట్‌‌‌‌. జట్టు మొత్తం అన్ని విభాగాల్లో బలంగా ఉంది. కెప్టెన్‌‌‌‌ రాహుల్‌‌‌‌ వారి ప్రధాన బలం కాగా.. క్రిస్ గేల్‌‌‌‌ రాకతో బ్యాటింగ్‌‌‌‌లో మరింత సమతూకం‌‌‌ వచ్చింది. మన్‌‌‌‌దీప్‌ సింగ్‌‌‌ కూడా రాణించడం కలిసొచ్చే అంశం. అయితే ఈ మ్యాచ్‌‌‌‌తో మయాంక్‌‌‌ అగర్వాల్‌ రీఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి. నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌; మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, దీపక్‌‌‌‌ హుడాతో బ్యాటింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌ బలంగా ఉంది. అయితే గత మూడు మ్యాచ్‌ల్లో రాహుల్ 15, 27, 28 పరుగులే చేయడం కొంత కలవరపెడుతుంది. అలాగే మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ వైఫల్యం కూడా కొనసాగుతుంది. ఈ ఇద్దరు సత్తా చాటాల్సిన అవసరం ఉంది. మహ్మద్ షమీ ఆధ్వర్యంలోనే బౌలింగ్‌‌‌‌లో లైనప్‌‌‌‌లోనూ పెద్దగా సమస్యల్లేవు. అతనికి తోడుగా అర్ష్‌దీప్ సింగ్, రవిబిష్ణోయ్ రాణిస్తున్నారు. మయాంక్ జట్టులోకి వస్తే దీపక్ హుడా, మన్‌దీప్‌లలో ఒకరు బెంచ్‌కు పరిమితం కావచ్చు.

రెట్టించిన ఉత్సాహంతో రాజస్థాన్

రెట్టించిన ఉత్సాహంతో రాజస్థాన్

మరోపక్క రాజస్తాన్‌‌‌‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ సూపర్‌‌‌‌ సెంచరీ చేయడంతో ముంబైపై గత‌‌‌ మ్యాచ్‌‌‌‌లో గెలిచిన రాజస్థాన్‌‌‌‌లో ఆత్మవిశ్వాసం‌‌‌ పెరిగింది. స్టోక్స్‌‌‌‌ గత పెర్ఫామెన్స్‌‌‌‌ను రిపీట్‌‌‌‌ చేయాలని కోరుకుంటుంది. సంజు శాంసన్‌‌‌‌ కీలకం కానుండగా.. స్మిత్‌‌‌‌, బట్లర్‌‌‌‌ రాణించడంపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆర్చర్‌‌‌‌ నాయకత్వంలోని బౌలర్లు ఇటీవల తేలిపోతుండడం రాయల్స్‌‌‌‌ను కాస్త కలవరపెడుతుంది. అంకిత్ రాజ్‌పుత్ వద్దనుకుంటే వరుణ్ అరుణ్ లేక జయదేవ్ ఉనాద్కత్ జట్టులోకి రావచ్చు.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

పంజాబ్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్రిస్ గేల్, మయాంక్‌ అగర్వాల్‌, మాక్స్‌వెల్‌, నికోలస్ పూరన్, మన్‌దీప్ సింగ్/దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్‌ అశ్విన్‌, రవి బిష్ణోయ్‌, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

రాజస్థాన్‌: బెన్ స్టోక్స్, రాబిన్ ఊతప్ప, సంజూ శాంసన్‌, స్టీవ్‌ స్మిత్ (కెప్టెన్‌), జోస్ బట్లర్, రియాన్‌ పరాగ్‌, రాహుల్ తెవాటియా, శ్రేయస్‌ గోపాల్‌, జోఫ్రా ఆర్చర్,అంకితి రాజ్‌పుత్/వరుణ్ ఆరోన్/ జయదేవ్ ఉనద్కత్, కార్తీక్ త్యాగి

పిచ్ రిపోర్ట్

పిచ్ రిపోర్ట్

దుబాయ్ పిచ్ చేజింగ్‌కు అనుకూలిస్తుంది. ఇక్కడ జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో అదే జరిగింది. దాంతో టాస్ గెలిచే జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ముఖా ముఖి:

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 20 సార్లు తలపడగా 11-9తో రాజస్థాన్ లీడ్‌లో ఉంది. గత సీజన్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో పంజాబే విజయం సాధించింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, October 30, 2020, 15:13 [IST]
Other articles published on Oct 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X