For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KXIP vs RR: అదే మా కొంపముంచింది: కేఎల్‌ రాహుల్‌

IPL 2020, KXIP vs RR: KL Rahul says It was terrible toss to lose

అబుదాబి: ఐపీఎల్ 2020లో డబుల్‌ హ్యాట్రిక్‌ నమోదు చేయాలనుకున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌ శుక్రవారం పంజాబ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆశలు లేని స్థితి నుంచి వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరువైన పంజాబ్‌కు రాజస్థాన్‌ చుక్కలు చూపించింది. భారీ లక్ష్యం ముందున్నా ఏమాత్రం వెరవకుండా.. బెన్ స్టోక్స్‌, సంజూ శాంసన్‌ వీరబాదుడు బాదడంతో స్మిత్‌ సేన సునాయాస విజయాన్నందుకుంది. ఈ విజయంతో రాజస్థాన్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకగా.. ప్లేఆఫ్‌ అవకాశాలను పంజాబ్ సంక్లిష్టం చేసుకుంది. ఈ ఓటమిపై పంజాబ్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ స్పదించాడు.

లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడానికి మంచే కారణమని కేఎల్‌ రాహుల్‌ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ... 'నిజం చెప్పాలంటే టాస్‌ ఓడిపోవడం ద్వారా మాకు నష్టమే జరిగింది. మా ఇన్నింగ్స్‌ తర్వాత బ్యాటింగ్‌ చేయడం సునాయాసంగా అనిపించింది. రెండో అర్ధ భాగంలో ఎక్కువగా మంచు కురవడంతో బంతిపై పట్టు దొరకబుచ్చుకొనేందుకు బౌలర్లు బాగా ఇబ్బంది పడ్డారు. జట్టులో ఇద్దరు లెగ్‌ స్పిన్నర్లు ఉంటే పరిస్థితులు సంక్లిష్టంగానే ఉంటాయి. మేం చెత్తగా బౌలింగ్‌ చేశామని అనుకోను. కానీ తడి బంతితో మెరుగ్గా బౌలింగ్‌ చేసేందుకు అలవాటు పడాలి' అని రాహుల్ అన్నాడు.

'ఐపీఎల్ 2020‌లో మంచును ఏమాత్రం ఊహించలేకపోతున్నాం. ఒక్కోరోజు ఒకలా ఉంటుంది. మంచుకు ఎలాంటి సన్నద్ధలు ఉండవు కాబట్టి అలవాటు పడాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్‌లో మా విజయాల జైత్రయాత్ర అంత సులభంగా సాధ్యమవ్వలేదు. ప్రతి అంశంపై మేమెంతో సాధన చేశాం. ప్రతి విభాగాన్ని కష్టపడి పటిష్ఠం చేసుకున్నాం' అని కేఎల్‌ రాహుల్‌ తెలిపాడు. క్రిస్ ‌గేల్‌ (99) రాణించడంతో రాజస్థాన్ ముందు 186 పరుగుల లక్ష్యం విధించింది పంజాబ్. బెన్ ‌స్టోక్స్‌ (50), సంజు శాంసన్‌ (48) చితక్కొట్టడంతో 17.3 ఓవర్లకే రాజస్థాన్‌ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌ ఫలితంతో పాయింట్ల పట్టికలో జట్ల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

'గత మ్యాచులలో ఇక్కడ స్కోర్‌లను చూస్తే 160-170గా ఉంది. దీన్ని బట్టి చూస్తే మేము 10-20 పరుగులు ఎక్కువే చేశాం అనుకున్నాం. కానీ ఓడిపోయాం. మన్‌దీప్ వికెట్ కోల్పోయిన తర్వాత వికెట్ నెమ్మదించింది. అయినా క్రిస్ గేల్ బాగా ఆడాడు. గేల్ కాకుండా మరెవరూ ఈ వికెట్‌పై బ్యాటింగ్ చేయలేరని నా అభిప్రాయం. నేను ఇంతకు ముందే చెప్పాను.. గేల్ మా డ్రెస్సింగ్ రూమ్‌లో కీలక పాత్ర పోషిస్తాడు. అతన్ని కలిగి ఉండటం మా అదృష్టం. అతను డ్రెస్సింగ్ రూమ్‌ను పాజిటివ్‌గా ఉంచుతాడు. క్రిస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా సరదాగా ఉంటుంది' అని రాహుల్ చెప్పాడు.

Story first published: Saturday, October 31, 2020, 12:08 [IST]
Other articles published on Oct 31, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+