For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KXIP vs RR: 99 రన్స్ వద్ద ఔట్.. బ్యాట్ విసిరికొట్టిన గేల్‌కు జరిమానా!!

IPL 2020, KXIP vs RR: Kings XI Punjab batsman Chris Gayle fined 10 peecent match fee
IPL 2020,KXIP vs RR : Chris Gayle Fined 10% Of His Match Fee, Here's The Reason

అబుదాబి: శుక్రవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సునాయాస విజయం సాధించిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ (63 బంతుల్లో 99; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్‌ రాయల్స్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెన్‌ స్టోక్స్‌ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ శాంసన్ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు.

సెంచరీ మిస్ కావడంతో:

సెంచరీ మిస్ కావడంతో:

ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ ఆటగాడు క్రిస్‌ గేల్ ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో సిక్స్ బాదిన గేల్.. 99 రన్స్‌కు చేరుకున్నాడు. ఆ మరుసటి బంతికే ఆర్చర్ అద్భుతమైన యార్కర్‌‌తో గేల్‌ను బౌల్డ్ చేశాడు. ముందుగా ప్యాడ్లను తాకిన బంతి.. ఆ తర్వాత వికెట్లను గిరాటేసింది. సెంచరీ మిస్ కావడంతో గేల్ ఫ్రస్టేషన్‌కు లోనయ్యాడు. ఆగ్రహంతో చేతిలో ఉన్న బ్యాట్‌ను విసిరేశాడు.

మ్యాచ్ ఫీజులో పది శాతం కోత:

మ్యాచ్ ఫీజులో పది శాతం కోత:

ఔట్ అయిన వెంటనే క్రిస్‌ గేల్ తనను బౌల్డ్ చేసిన జోఫ్రా ఆర్చర్‌తో చేయి కలిపి అభినందించాడు. మరో ఎండ్‌లో ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్.. గేల్‌కు బ్యాట్‌ను అందించాడు. ఆపై యూనివర్సల్ బాస్.. బ్యాట్‌ హ్యాండిల్‌పై హెల్మెట్‌ను పెట్టుకొని హుందాగా బయటకు నడిచాడు. బ్యాట్ విసిరి కొట్టిన గేల్‌కు జరిమానా పడింది. ఔటయ్యాక ఆగ్రహం వ్యక్తం చేయడం ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలకు విరుద్ధం. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని అఫెన్స్ 2.2లోని లెవల్ 1 ప్రకారం మ్యాచ్ రిఫరీ.. గేల్ మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించాడని ఐపీఎల్ ప్రకటించింది.

ఇది రెండోసారి:

ఇది రెండోసారి:

ఐపీఎల్‌లో క్రిస్‌ గేల్ 99 రన్స్ వద్ద ఔట్ అవ్వడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు ఓసారి కూడా 99 రన్స్ వద్ద ఆగిపోవడం కావడం గమనార్హం. 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గేల్ 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో రెండుసార్లు 99 రన్స్ చేసిన తొలి ఆటగాడిగా గేల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో 8 సిక్సులు బాదిన గేల్.. టీ20ల్లో 1000 సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. 18.5వ ఓవర్లో 1000వ సిక్స్ బాదాడు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో వరుసగా పొలార్డ్‌ (690), మెకల్లమ్‌ (485), వాట్సన్‌ (467), రసెల్‌ (447) ఉన్నారు.

 సెంచరీ చేస్తానని మాటిచ్చా:

సెంచరీ చేస్తానని మాటిచ్చా:

పంజాబ్ ఇన్నింగ్స్ అనంతరం క్రిస్‌ గేల్ మాట్లాడుతూ... 'ఇవాళ సెంచరీ చేస్తానని మా ఆటాళ్లకు మాటిచ్చాను. కానీ చేయలేకపోయాను. అయితే నా మనసుకు మాత్రం ఇది సెంచరీనే' అని నవ్వేశాడు. '99 పరుగుల వద్ద ఔటవడం దురదృష్టకరం. అయినా క్రికెట్‌ ఆడటాన్ని ఆస్వాదిస్తున్నా. ఈ వయసులో కూడా భారీ షాట్లు ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. యువ ఆటగాళ్లతో కలిసి బ్యాటింగ్ చేయడం సరదాగా ఉంది. పంజాబ్ ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే బాగుంటుంది' అని గేల్ పేర్కొన్నాడు.

అమ్మో బయో బుడగ.. టీ20 లీగ్‌ నేను ఆడను: స్టీవ్ ‌స్మిత్‌

Story first published: Saturday, October 31, 2020, 9:18 [IST]
Other articles published on Oct 31, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+