న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ బ్యాడ్ టైమ్: అదే తప్పు ఇంకో రెండుసార్లు చేస్తే.. ఏకంగా బ్యాన్: ఇప్పటికే భారీ కోత

IPL 2020: KXIP vs RCB: Virat Kohli fined for slow over-rate against Kings XI
IPL 2020 : RCB Captain Virat Kohli Fined Rs 12 Lakh For Slow Over-Rate || Oneindia Telugu

దుబాయ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కేప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. ఈ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో అద్దిరిపోయే విజయాన్ని అందుకున్నప్పటికీ.. దాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి ఆ తరువాతి పరిణామాలు. ఐపీఎల్‌ను విజయంతో బోణీ కొట్టినప్పటికీ.. ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఒకదాని వెంట ఒకటి అతన్ని వెంటాడుతూ వస్తున్నాయి. అతనికి అందే రెమ్యునరేషన్‌లో భారీగా కోత పడింది. ఆ కోత పడటానికి చేసిన తప్పు మరో రెండు సార్లు గనత రికార్డుల్లోకి వెళితే.. ఏకంగా ఓ మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది.

 స్లో ఓవర్ రేట్ కొంప ముంచుతుందా?

స్లో ఓవర్ రేట్ కొంప ముంచుతుందా?

ఆ తప్పే- స్లోఓవర్ రేట్. ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియంలో గురువారం రాత్రి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా స్లో ఓవర్ రేట్ నమోదు అయింది. తొలుత ఫీల్డింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్‌లో స్లో ఓవర్ రేట్ రికార్డయింది. ఇది ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోడ్ ఆఫ్ కండక్ట్ మినిమం ఓవర్ రేట్ నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. దీన్ని ఉల్లంఘించినందుకు కేప్టెన్ విరాట్ కోహ్లీని బాధ్యుడిగా నిలిచారు. 12 లక్షల రూపాయల మేర రెమ్యునరేషన్‌లో కోత విధించారు.

రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదైతే ఏం చేస్తారు?

రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదైతే ఏం చేస్తారు?

రెండోసారి కూడా స్లో ఓవర్ రేట్ నమోదైతే.. ఈ జరిమానా రెట్టింపు అవుతుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. రెండోసారి స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేసిన జట్టు కేప్టెన్‌పై 24 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. అంతేకాకుండా- ఆ టీమ్‌లోని ప్రతి క్రికెటర్‌కూ దీన్ని వర్తింపజేస్తారు. అంటే.. ప్రతి క్రికెటర్ కూడా ఆరు లక్షల రూపాయలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర మొత్తాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇందులో ఏది తక్కువ మొత్తం అయితే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ మొత్తాన్ని కోత పెడతారు.

మూడో సారి పెనాల్టీ మాత్రం తీవ్రంగా..

మూడో సారి పెనాల్టీ మాత్రం తీవ్రంగా..

మూడోసారి కూడా అదే తప్పు జరిగితే.. దాని మూల్యం తీవ్రంగా ఉంటుంది. జట్టు కేప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధాన్ని విధిస్తారు. అతను ఆడే తదుపరి మ్యాచ్‌ నుంచి తప్పిస్తారు. ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలో.. ఆ మాటకొస్తే రెండో మ్యాచ్‌లోనే స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేయడం రాజస్థాన్ రాయల్స్‌కు ఒకరకంగా ఇబ్బందులకు గురి చేసేదే. ఇంకో రెండు మ్యాచ్‌లల్లో స్లో ఓవర్ రేట్‌ను రాయల్ ఛాలెంజర్స్ నమోదు చేస్తే.. అంతే సంగతులు. విరాట్ కోహ్లీ నిషేధానికి గురవుతాడు. ఇప్పటికే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై దారుణ పరాజయాన్ని చవిచూడటం, లడ్డూ లాంటి రెండు క్యాచ్‌లను జారవిడవటం, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన ప్రస్తుత పరిస్థితుల్లో రాయల్ ఛాలెంజర్స్ ఆత్మస్థైర్యం అడుగంటింది.

Story first published: Friday, September 25, 2020, 12:29 [IST]
Other articles published on Sep 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X